Thursday, May 16, 2024

5 రోజుల్లో రూ. 3,076 కోట్ల విరాళాలు

- Advertisement -
- Advertisement -
PM CARES Gets Rs 3076 Crore In 5 Days
పిఎం-కేర్స్ ఫండ్ లెక్క చెప్పిన కేంద్రం

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందకు ఏర్పాటు చేసిన పిఎం-కేర్స్ ఫండ్‌కు ఐదు రోజుల్లో రూ. 3,076 కోట్ల విరాళాలు లభించాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఆడిట్ స్టేట్‌మెంట్ ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2020 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించిన ఆడిట్ స్టేట్‌మెంట్‌ను ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఈ ఏడాది మార్చి 27 నుంచి(ఫండ్ ఏర్పాటు చేసిన రోజు) మార్చి 31వ తేదీ మధ్య పిఎం కేర్స్ ఫండ్ స్వీకరించిన విరాళాల వివరాలను ప్రభుత్వం తెలిపింది. ఐదు రోజులకు గాను అందిన రూ. 3,076 కోట్ల విరాళాలలో రూ. 3,075.85 కోట్లు దేశీయంగా లభించగా రూ. 39.67 కోట్లు విదేశీ విరాళాలు ఉన్నాయి. పిఎం కేర్స్‌లో మూలధన పెట్టుబడి రూ. 2.25 కోట్లు ఉందని, మొత్తం రూ. 35 లక్షల వడ్డీ కూడా లభించిందని ప్రభుత్వం తెలిపింది.

పిఎం-కేర్స్ ఫండ్ వెబ్‌సైట్‌లో ఈ ఆడిట్ స్టేట్‌మెంట్‌ను అప్‌లోడ్ చేసినప్పటికీ స్టేట్‌మెంట్‌లోని అనుబంధ పత్రాలు 1 నుంచి 6 వరకు ప్రజలకు బహిర్గతం చేయలేదు. దీన్ని బట్టి దేశీయ, విదేశీ విరాళాల దాతల పేర్లను ప్రభుత్వం బహిర్గతం చేయలేదని అర్థం చేసుకోవాలి. కాగా..ఆ ఔదార్య దాతల పేర్లను ఎందుకు వెల్లడించలేదంటూ కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ట్వీట్ల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చే దాతల పేర్లను ప్రతి స్వచ్ఛంద సంస్థ లేదా ట్రస్టు వెల్లడించాలన్న నిబంధన ఉండగా పిఎం కేర్స్ ఫండ్‌కు మాత్రం ఎందుకు ఈ నిబంధన వర్తించదని ఆయన ప్రశ్నించారు. విరాళాల గ్రహీత ఎవరో అందరికీ తెలుసు. ఆ ట్రస్టుకు చెందిన ట్రస్టీలు ఎవరో కూడా తెలుసు. మరి దాతల పేర్లు వెల్లడించడానికి ట్రస్టీలు ఎందుకు భయపడుతున్నారు అంటూ చిదంబరం వ్యాఖ్యానించారు.

PM CARES Gets Rs 3076 Crore In 5 Days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News