Saturday, April 27, 2024

నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పిఎం గతి శక్తి ఆమోదం!

- Advertisement -
- Advertisement -
2021 అక్టోబర్‌లో పిఎం గతి శక్తి అనే జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి సమగ్ర, ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్షంతో దీనిని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి గతి శక్తి చొరవ కింద నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్(ఎన్‌పిజి) రైల్వేలకు సంబంధించిన నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని శుక్రవారం ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. 2021 అక్టోబర్‌లో పిఎం గతి శక్తి అనే నేషనల్ మాస్టర్ ప్లాన్ సరకు రవాణా ఖర్చులను తగ్గించడానికి, సమగ్ర, ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్షంతో ప్రారంభించారు. రూ. 500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో రూపొందించే అన్ని లాజిస్టిక్స్, కనెక్టివిటీ మౌలికవసతుల ప్రాజెక్టులు ఇకపై ఎన్‌పిజి ద్వారా మళ్లించబడతాయి.

‘పిఎంజి గతి శక్తి ఆధ్వర్యంలోని ఎన్‌పిజి తన 46వ సెషన్‌లో నాలుగు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను పరిశీలించి సిఫార్సు చేసింది’ అని వాణిజ్యం, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాజెక్టులను సమీకృత, సంపూర్ణ విధానాన్ని ఉపయోగించి పిఎం గతి శక్తి సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టులు మల్టీమోడల్ కనెక్టివిటీ, సరుకులు, ప్రయాణీకుల నిరంతర రవాణాకు తోడ్పతాయని పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News