Sunday, May 12, 2024

మూడో సారీ మోడీదే అధికారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రముఖ న్యూస్ చానల్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది ’నేషన్ సర్వే దేశ భవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.గురువారం ఈ సర్వే ఫలితాలను ఆ చానల్ వెల్లడించింది. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ కూటమి భారీ మెజారిటీతో మూడో సారి తిరిగి అధికారంలోకి రావచ్చని అయితే 400కు మిచి స్థానాలను దక్కించుకోవాలన్న టార్గెట్‌కు చాలా దూరంలోనే నిలుస్తుందని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికలు గనుక ఇప్పుటికిప్పుడు జరిగితే బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 335 స్థానాలను దక్కించుకోవడం ద్వారా అధికారంపై తన పట్టును నిలుపుకొంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాలకన్నా ఇది ఎక్కువే కానీ ఇప్పుడున్న బలంతో పోటిస్తే ఆ కూటమి 18 స్థానాలను కోల్పోనుంది.

ఈ మేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి లబ్ధిపొందుతుంది. ఇండియా కూటమి 166 స్థానాల్లో విజయం సాధించవచ్చు కానీ ఎన్‌డిఎ బలంగా ఉన్న రాష్ట్రాల్లో దానికి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ మొత్తం 543 స్థానాల్లో 304 స్థానాలు దక్కించుకొంటుంది. అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మించి స్థానాలను దక్కించుకోనుంది. అంతేకాదు, 2019లో ఆ పార్టీ సాధించిన 303 స్థానాలకన్నా ఒక సీటు ఎక్కువే కావడం గమనార్హం. ఇక కాంగ్రెస్ పార్టీ 71 స్థానాలతో రెండో స్థానంలో నిలుస్తుంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన స్థానాలకన్నా 19 సీట్లు ఎక్కువ ఆ పార్టీ సాధించనుంది. ఇతర పార్టీలు 168 స్థానాలను దక్కించుకోనున్నాయి.

అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఇంటర్వ్లూద్వారా శాస్త్రీయపద్ధతిలో నిర్వహించిన ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే సంక్షేమ పథకాలతో పాటు, జాతీయ దృక్పథం ద్వారా ప్రజల్లో బిజెపి సాధించిన పట్టుకు అద్దం పడుతోంది.అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అందించడంతో పాటుగా కలిసికట్టుగా ఉన్నామని చెప్పడంలో ప్రతిపక్షాల వైఫల్యం ఎన్నికల్లో ఆ కూటమి వైఫల్యానికి కీలకమైన అడ్డంకిగా కనిపిస్తోంది. అయితే జాతీయ స్థాయిలో తన ఆధిక్యతను అసెంబ్లీ ఎన్నికల్లోను కనబరిచే విషయంలో బిజెపి సవాళ్లను ఎదుర్కొంటోందనే విషయం దేశ వ్యాప్తంగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఒక్క యుపి మాత్రం ఇందుకు మినహాయింపుగా ఉంది. మిగతా రాష్ట్రాల విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి విపక్షాలనుంచిగట్టి పోటీ ఎదురయ్యే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News