Monday, April 29, 2024

థ్యాంక్స్ మోదీ జీ..

- Advertisement -
- Advertisement -

PM Modi praises Team India as part of Mann Ki Baat

 

టీమిండియా ఎమోషనల్ ట్వీట్

ఢిల్లీ : మన్ కీ బాత్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గబ్బాలో చారిత్రక విజయాన్ని నమోదు చేయడంపై భారత జట్టు ప్రతిభను కొనియాడారు. ’ ఈ నెలలో మనకు క్రికెట్ ఒక శుభవార్త అందించింది. ఆసీస్ గడ్డపై ఆదిలో భారత జట్టు ఒడిదొడుకలకు లోనైనా.. చివరలో మాత్రం టెస్టు సిరీస్‌లో అదరగొట్టి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. మన జట్టు కృషి, సమిష్టి పోరాటం అందరికి స్పూర్తిదాయకం’ అని పేర్కొన్నారు. తాజాగా మోదీ చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, సహా పలువురు ఆటగాళ్లు స్పందించారు. ’థ్యాంక్యూ మోదీ జీ.. మీ మాటలు మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. స్పూర్తిని నింపే మీ వాఖ్యలతో భారతీయ జెండాను మరింత ఎత్తులో ఎగరడానికి మా వంతు కృషి చేస్తాం.

రాబోయే మ్యాచ్‌ల్లో మరింత ప్రతిభను చూపి సిరీస్‌లు గెలిచేందుకు సాధ్యమైనంత వరకు పోరాడుతాం. జై హింద్’ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మోదీ చేసిన వ్యాఖ్యలను రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను ట్వీట్ చేశాడు. చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది ’థ్యాంక్యూ సార్.. మీ మాటలు మాకు ఎంకరేజింగ్ అనిపించాయి. మీలాంటి వ్యక్తులిచ్చే సందేశం మాలాంటి వారికి ఎంతో గౌరవాన్ని కల్పిస్తాయి.’ అంటూ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ట్వీట్ చేశాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. ’ఆసీస్ గడ్డపై టీమిండియా వీరోచిత ప్రదర్శనను గుర్తించినందుకు మోదీ జీ.. మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News