Monday, May 6, 2024

తలైవాకు ప్రధాని మోడీ పుట్టిన రోజు శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

PM Modi wishes Rajinikanth on his 70th birthday

చెన్నై: తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్రమోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. అలాగే, శనివారం 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ కు కూడా మోడీ బర్త్ డే విషెస్ చెప్పారు. ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఇటీవలే రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 31న పార్టీ పేరు, గుర్తును వెల్లడించి, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తలైవా పార్టీ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News