Saturday, May 4, 2024

పోలీసులకు చిక్కి.. కటాకటాలపాలైన పెప్పర్‌స్ప్రే లవర్స్‌..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు.. రోజూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అవసరాలకు కావాల్సిన డబ్బు కోసం ఆ ఇద్దరు జంటగా మోసాలు చేయటం అలవర్చుకున్నారు. చివరకు కటాకటాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లిలో నివసించే భాను ప్రకాష్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. ఆ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన మానస అనే యువతితో అతడికి పరిచయమేర్పడింది. అనంతరం ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో పడిపోయారు. ఇద్దరూ కలిసి పార్కులు, సినిమాలకు తిరిగేవారు. జల్సాలకు అలవాటుపడిన వీరిద్దరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కారు. పెప్పర్ స్ప్రేతో దాడి చేసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం కొన్ని పెప్పర్‌స్ప్రేలు కొనుగోలు చేశారు.

హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్ చేసుకుని వారిపై పెప్పర్‌స్ప్రే జల్లి దొంగతనాలకు పాల్పడేవారు. ఈ విధంగా మేడిపల్లి ప్రాంతంతో పాటు ఘట్‌కేసర్, వనస్థలిపురం, కూకట్‌పల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అనేక దొంగతనాలకు పాల్పడ్డారు. కొంతకాలంగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఈ పెప్పర్‌స్ప్రే లవర్స్‌ చివరకు రాచకొండ పోలీసులకు చిక్కారు. మేడిపల్లి ప్రాంతంలో జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీఫుటేజీలో ఈ ప్రేమ జంట విజువల్స్ స్పష్టంగా గోచరించాయి. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి భానుప్రకాష్, మానసలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Police arrested Lovers for Robbery in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News