Friday, April 26, 2024

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల కాల్పుల్లో 17మంది పోలీసులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Police died

 

15 మందికి గాయాలు
మృతదేహాలు రాయ్‌పూర్‌కు తరలింపు, సిఎం భగేల్ దిగ్భ్రాంతి

మనతెలంగాణ/ కొత్తగూడెం: మావోయిస్టులు మాటువేశారు. ఆపరేషన్ నుంచి తిరిగి వస్తొన్న పోలీసులపై ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాజిల్లాలోని చింతగుఫా సమీపంలో శనివారం దాడి చేసి 17మంది పోలీసులను మట్టుపెట్టారు. ఈ సంఘటనతో ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా జిల్లా ఉలిక్కిపడింది. దాదాపు 15నెలల కాలంలో ఇలాంటి దాడి జరగలేదని అక్కడి పోలీసు వర్గాలు చెబుతున్నాయి.. నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొని తిరిగి పోలీసు క్యాంపునకు వస్తున్న ఎస్‌టిఎఫ్, చత్తీస్‌గఢ్ పోలీసుల డిఆర్‌జి బలగాలపై సుకుమా జిల్లాలోని చింతాగుఫా పోలీసు స్టేషన్ పరిధిలోని కాసల్‌పాడ్, మినప ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఎస్‌టిఎఫ్, డిఆర్‌జి పోలీసులు సంయక్తంగా ఆపరేషన్ నిర్వహించి వస్తుండగా ఈ అనూహ్య దాడి జరిగింది. పోలీసులు ఇదే దారిలో వస్తారన్న కచ్చితమైన అంచనాతో మావోయిస్టులు కాసల్ పాడ్ మినప ప్రాం తంలో శనివారం మాటువేసి దాడి చేసి 17మందిని పొట్ట న పెట్టుకున్నారు.

యుజిఎల్ బాంబులతో దాడి చేయడంతో ఆపరేషన్‌కు వెళ్లి తిరిగి వస్తు, ఈ ఊహించని దాడి తో పోలీసులు కకావికలం అయ్యారు. యుజిఎల్ పేల్చివేస్తే అందులో ఉన్న ఇనుపరాడ్లు గుచ్చుకుంటాయి. దీనితో గాయపడటం లేదా, ఇంకా తీవ్రగాయాలైతే తీవ్ర రక్తస్రావంతో మరణిస్తారు. దీనితో దాడికి మావోయిస్టులు యుజిఎల్ ను ఎంచుకున్నారని సమాచారం. ఈ దాడిలో దాదాపు 15మంది గాయపడ్డారు. అయితే మరో 17మంది గల్లంతయ్యారు. వారు దారితప్పారని అధికారులు తొలుత భావించారు. అయితే ఈ 17మంది యుజిఎల్ దాడిలో మృతిచెందారని ఆదివారం సమాచారం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను ఆదివారం అడవిలో కనుగొన్నారు. మృతుల్లో ఎస్‌టిఎఫ్ 12మంది, డీఆర్‌జి బలగాలకు చెందినఅయిదుగురు ఉన్నారు. పెద్ద ఎత్తును మృతుల వద్ద ఉన్న ఏకే 47 తుపాకులను, ఇతర ఆయుధాలను కూడా మావోయిస్టులు అపహరించారు. మృతదేహాలను ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు.

గాయపడ్డ వారిని రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ఈ స్ధాయిలో మావోయిస్టుల చేతిలో పోలీసు లు మృతిచెందటం ఇటీవల కాలంలో ఇదే పెద్దది. భారీ నష్టం జరగటంతో పోలీసులు దిగ్భ్రమకు గురయ్యారు. దాడిపై ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేష్ భగేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఒక అత్యవసర సమీక్ష సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ పో లీసు బాస్ సుబ్రత సాహూ, ఇంటిలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ను నిర్ణయించే అవకాశం ఉంది. పోలీసులు మరిన్ని జా గ్రత్తలు తీసుకుని మావోయిస్టులపై తిరిగి పైచేయి సాధించేందుకు తగిన వ్యూహరచనలో ఉన్నారని సమాచారం. ఈ దారిలోనే పోలీసులు వస్తారన్న సమాచారం ఎందుకు వెళ్లింది, అది మావోయిస్టులకు ఎలా చేరిందనేది కూడా ఉన్నత స్థాయి సమీక్షలో చర్చించారని సమాచారం.

Police died in Maoist firing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News