Saturday, May 4, 2024

డీజిల్ దొంగల అరెస్టు

- Advertisement -
- Advertisement -
Police have arrested gang that illegally steals Diesel

 

అదుపులోకి తీసుకున్న పోలీసులు
20,400లీడర్ల డీజిల్, మెటీరియల్ స్వాధీనం
మొత్తం విలువ రూ.13,87,200 విలువ ఉంటుంది

మనతెలంగాణ, హైదరాబాద్ : అక్రమంగా డీజిల్ దొంగతనం చేస్తున్న ముఠాను రాచకొండ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు వారి వద్ద నుంచి డీజిల్ ఉన్న ట్యాంకర్ 20,400 లీటర్లు, ఆరు మొబైల్ ఫోన్లు, క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.13,87,200 ఉంటుంది. ఏడుగురు వ్యక్తులు బొండ్ల ఉపేందర్ ప్రధాన నిందితుడు, కాటంగూరి సురేష్ రెడ్డి, నక్క శ్రీనుబాబు, మండాడి చిన్న రెడ్డి, పెద్ది వెంకటేష్, ఎండి సలాఉద్దిన్, మండల్ సుభాష్ ముఠాగా ఏర్పడి డీజిల్ దోపిడీ చేస్తున్నారు. ట్యాంకర్లలో డీజిల్ నింపిన తర్వాత బయటికి వెళ్లి వాటి నుంచి తీస్తున్నారు. ఉపేందర్ గతంలో చర్లపల్లిలోని ఐఓసిఎల్‌లో హెల్పర్‌గా పనిచేసేవాడు.

వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఉద్యోగం మానివేశాడు. డీజిల్ ట్యాంకర్ల నుంచి డీజిల్ తీసేందుకు ప్లాన్ వేశాడు. సురేష్ నాయకుడిగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేశారు. ఐడిఏ చర్లపల్లిలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన తర్వాత ట్యాంకర్ల నుంచి డీజిల్ తీసి కావాల్సిన వారికి విక్రయించేవారు. ప్రతి ట్యాంకర్ నుంచి 24లీటర్లు తీసి తెలిసిన వారికి విక్రయించేవారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్సైలు సత్యనారాయణ, అవినాష్ బాబు, లక్ష్మినారాయణ, తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News