Friday, May 3, 2024

అతనే నాకిష్టమైన క్రికెటర్

- Advertisement -
- Advertisement -

Pooja hegde said Rahul Dravid favorite cricketer

 

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో టాప్ హీరోయిన్‌గా పూజా హెగ్డే దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇక త్వరలోనే కోలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేయనుందని తెలిసింది. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో ఇంట్లోనే ఉంటున్న పూజ ఈ సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఖాళీగా ఉండటం ఎందుకని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో కాసేపు ముచ్చటిస్తోంది. ఈ సందర్భంగా లైవ్ చాట్‌లో అభిమానులతో మాట్లాడుతూ ఈ బుట్టబొమ్మ తన ఫేవరేట్ విషయాలను షేర్ చేసుకుంది.

లైవ్‌చాట్‌లో ఓ అభిమాని.. మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు? అని అడిగాడు. తనకు ఇష్టమైన క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని పూజా తెలిపింది. ఈ తరంలో ఎంతమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నా అతడికి సాటిరారని రాహుల్‌ని ఎంతో ప్రశంసించింది ఈ అమ్మడు. ది వాల్ ఓ కూల్ అండ్ క్లాసిక్ ప్లేయర్…అని చెప్పింది. ఇక ప్రస్తుత ఆటగాళ్లలో ధోని, కె.ఎల్.రాహుల్ ఆటతీరు తనకు నచ్చుతుందని ఈ బ్యూటీ పేర్కొంది. ఇక మరో అభిమాని.. మీరు నటి కాకపోతే ఏం చేసేవారని అడిగాడు. ఆ ప్రశ్నకు స్టైలిష్ ఫొటోగ్రాఫర్ అయ్యేదాన్ని అంటూ నవ్వుతూ బదులిచ్చింది ఈ సుందరి. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌తో ఓ చిత్రం, అఖిల్‌తో మరో సినిమాలో నటిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News