Wednesday, May 1, 2024

గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు

- Advertisement -
- Advertisement -

Poster released from Radheshyam

ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదల కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆసక్తికర పోస్టర్ విడుదలైంది. ‘గుండె ఒక్కటే అయినా.. రెండు చప్పుళ్ళు ఉంటాయి’ అంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరూ పరదా చాటున కనిపించారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జానర్‌లో చేస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా ప్రత్యేకమైన క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతున్నారు. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే ప్రేమకథగా ‘రాధే శ్యామ్‘ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కెకె రాధాకృష్ణ కుమార్.

కాగా సోమవారం సాయంత్రం 7 గంలకు, రాధేశ్యామ్ మ్యూజిక్ ఆల్బమ్ నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ‘నగుమోము తారలే’ టీజర్‌ను విడుదల చేయడానికి రంగం సిధ్ధం అయింది. ఈ సినిమాకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. హిందీ వర్షన్‌ను మాత్రం మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. అందుకే ఒకే గుండెకు రెండు చప్పుళ్లు అనే పోస్టర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. వచ్చే ఏడాది జనవరి 14న ఈ సినిమా విడుదల కానుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News