Friday, April 26, 2024

ప్రభాస్ ద్విపాత్రాభినయం

- Advertisement -
- Advertisement -

Prabhas double action in Nag ashwin direction movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్‌అశ్విన్ డైరెక్షన్‌లో చేయనున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కథ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. నాగ్ అశ్విన్ ఓ పురాణ కథలోని పాత్రల ఆధారంగా నేటి సమాజానికి తగ్గట్లు కథ రాసుకున్నాడని.. ముఖ్యంగా ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకోవాలని చూస్తున్నాడట. ఇప్పటికే కొంతమందితో ఫోన్‌లోనే సంప్రదించినట్లు తెలిసింది. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమా స్క్రిప్ట్ కి డైలాగ్స్ రాస్తున్నాడు. ఇక తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు నాగ్ అశ్విన్. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News