Home తాజా వార్తలు ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్

ప్రభుదేవా, అదాశర్మ, నిక్కి గల్రాని హీరో హీరోయిన్లు గా నటించిన తమిళ చిత్రం ‘చార్లీ చాప్లిన్’ ఇటీవల విడుదలై విజయం సాధించి మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎం.వి. కృష్ణ సమర్పణలో శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి తెలుగులోకి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీ జ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు శ్రీనివాసరావు, గుర్రం మహేష్ చౌదరి మాట్లాడుతూ “ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయి. ప్రభుదేవా పర్‌ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశర్మ, నిక్కి గల్రాని అందం, అభినయం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాను ఈ నెల 29న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం”అని అన్నారు.