Friday, May 10, 2024

సిఎం కెసిఆర్ మనసు బంగారం: ప్రకాష్‌రాజ్

- Advertisement -
- Advertisement -

actor-prakash-raj

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం లాక్‌డౌన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో సిఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. తాజాగా ఓ మీడియా ఛానల్ ఆయన్ను ఆన్‌లైన్ ఇంటర్వ్యూ చేసింది. లాక్‌డౌన్ పరిస్థితులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ స్పందనేంటి? అని ప్రశ్నించగా.. ప్రకాష్‌రాజ్ దానికి సమాధానమిచ్చారు. కెసిఆర్ ప్రజలకు ఇచ్చే భరోసా అందరిలో ధైర్యం నింపుతోందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ వ్యక్తిత్వం గొప్పదని, అలాగే ఆయన మనస్సు బంగారమని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు. ఇకపోతే ప్రధాని మోదీతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధాని తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించాలన్నారు. ఇలాంటి సమయంలో తనకైనా, ప్రధాని మోదీకైనా శత్రువు కరోనా వైరస్ ఒక్కటే అని, దానిని నివారించడంలోనే మనమంతా భాగం కావాలే తప్ప ఏ ఒక్కరూ రాజకీయాలు మాట్లాడకూడదన్నారు. ఈ సంక్షోభం ముగిసిన తర్వాత వాటి వల్ల మంచి జరిగిందా?, చెడు జరిగిందా? అన్న దానిపై ఆలోచించాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సమష్టిగా కరోనా వైరస్‌పై పోరాడాలని ప్రకాష్‌రాజ్ పిలుపునిచ్చారు.


ఆర్థిక వనరులు క్షీణించినా వెనక్కితగ్గను
సేవా కార్యక్రమాల విషయంలో తన ఆర్థిక వనరులు క్షీణించినా కూడా వెనక్కితగ్గనని, అప్పు చేసైనా, బ్యాంకులో రుణం తీసుకునైనా కొనసాగిస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు.  ఒక్కసారి షూటింగ్స్ స్టార్ట్ అయితే ఆ డబ్బు సంపాదించుకోవడం సులువే అని ఆయన ఓపెన్‌గా ఆ ఇంటర్వూలో పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంటికే పరిమితమైన ప్రకాష్‌రాజ్ ప్రస్తుతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ సంక్షోభ సమయంలో పేదలకు అండగా నిలుస్తూ ఆయన గొప్ప మనస్సు చాటుకుంటున్నారు.

Prakash Raj praises on CM KCR Visionary Amid Lockdown

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News