Friday, May 17, 2024

నూతన విద్యాసంవత్సరాన్ని సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభించాలి

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: మహమ్మారి క‌రోనా వైర‌స్(కోవిడ్-19) ప్రపంచాన్ని అతలాకుతులం చేస్తోంది. కరోనాను అరికట్టేందుకు ప్రపంచంలోని పలు దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా విస్తరిస్తుండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేప‌థ్యంలో విద్యాసంస్థలు మూసివేసిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే జరగాల్సి పరీక్షలు కూడా వాయిదా వేశారు. మరోవైపు కరోనా వైరస్ ఎప్పడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో నూతన విద్యాసంవత్సరం నిర్వహణ, ఆన్ లైన్ క్లాసులపై స్టడీ చేసేందుకు యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్(యుజిసి) రెండు క‌మిటీల‌ను వేసింది. నూతన విద్యాసంవ‌త్స‌రం, ఆన్‌లైన్ విద్య గురించి స్ట‌డీ చేసిన రెండు కమిటీలు శుక్రవారం తమ నివేదికలను యుజిసికి సమర్పించాయి.

నూతన విద్యాసంవ‌త్స‌రాన్ని జులై నుంచి కాకుండా సెప్టెంబ‌ర్ నెల నుంచి ప్రారంభించాలని హ‌ర్యానా వ‌ర్సిటీ వీసీ ఆర్‌సీ కుహ‌ద్ నేతృత్వంలోని మొదటి క‌మిటీ సూచించింది. ఇక, ఇగ్నో వీసీ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలోని రెండో కమిటీ వ‌ర్సిటీల్లో కావాల్సినంత మౌళిక స‌దుపాయాలు ఉంటే ఆన్‌లైన్ ప‌రీక్ష‌లు చేప‌ట్ట‌వ‌చ్చు అని సూచించింది. ఈ రెండు కమిటీల నివేదికలను మాన‌వ‌వ‌న‌రుల మంత్రిత్వ‌శాఖ(హెచ్ఆర్డీ) ప‌రిశీలిస్తుం‌ది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని (హెచ్ఆర్డీ) పేర్కొంది.

UGC Recommended Academic Session from september

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News