Monday, May 6, 2024

ముగిసిన ఎన్‌సిఎల్‌ఎటి చైర్‌పర్సన్ రిటైర్మెంట్ వివాదం

- Advertisement -
- Advertisement -
Prematurely Retired Acting NCLAT Chairperson
సెప్టెంబర్ 20 దాకా చీమా కొనసాగేందుకు సుప్రీంకోర్టులో కేంద్రం అంగీకారం

న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పెలేట్ ట్రిబ్యునల్(ఎన్‌సిఎల్‌ఎటి) మాజీ చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ ఇక్బాల్ సింగ్ చీమా గడువుకన్నా ముందుగా రిటైర్మెంట్‌పై వివాదం గురువారం సుప్రీంకోర్టులో పరిష్కారమైంది. తీర్పులు ప్రకటించడం కోసం చీమా సెప్టెంబర్ 20 వరకు కొనసాగడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. ఎన్‌సిఎల్‌ఎటి మాజీ చైర్‌పర్సన్ జస్టిస్ చీమా ఈ నెల 20న రిటైర్ కావలసి ఉంది. అయితే అంతకు ముందే సెప్టెంబర్ 11నుంచి జస్టిస్ ఎం వేణుగోపాల్‌ను ట్రిబ్యునల్ తాత్కాలిక చైర్‌పర్సన్‌గా కేంద్రం నియమించింది. దీంతో చీమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ‘ నాకు కేంద్రంనుంచి సూచనలు వచ్చాయి.

తీర్పులు రాయడం కోసం చీమా సెలవు తీసుకున్నట్లు తెలిసింది. అందువల్ల ఆయనను కార్యాలయానికి వెళ్లి తీర్పులు ప్రకటించడానికి అనుమతించాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుత చైర్‌పర్సన్ వేణుగోపాల్‌ను సెలవుపై పంపిస్తారు’ అని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీతో కూడిన బెంచ్‌కి తెలియజేశారు. దీంతో కేంద్రం వివరణను అంగీకరిస్తున్నామని, ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తుందని బెంచ్ పేర్కొంది. ప్రస్తుత చైర్‌పర్సన్ సెస్టెంబర్ 20 వరకు సెలవులో ఉంటారని, ఈ కేసులోని విచిత్ర పరిస్థితుల దృష్టా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News