Saturday, May 4, 2024

నేపాల్ పార్లమెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

President approves dissolution of Nepal's parliament

 

ఏప్రిల్-‌మేలో మధ్యంతర ఎన్నికలు
విస్తుపరిచిన సంచలన నిర్ణయం
ప్రధాని ఓలి మంత్రి మండలి సిఫారసును ఆమోదించిన దేశాధ్యక్షురాలు
నిర్ణయాన్ని ఖండించిన పాలక కమ్యూనిస్టు పార్టీ

ఖాట్మండూ : నేపాల్ పార్లమెంట్ రద్దయింది. ప్రధాని కెపి శర్మ ఓలి సిఫార్సు మేరకు దేశాధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదివారం పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ మే మధ్యలో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 30న రెండో విడత మే 10వ తేదీన జరుగుతుంది. దేశ రాజకీయాలలో పార్లమెంట్ రద్దు నిర్ణయం సంచలనం కల్గించింది. ఆదివారం ఉదయం ప్రధాని ఓలి తమ మంత్రిమండలితో సమావేశం అయ్యారు. కొద్ది సేపు తర్జనభర్జనల తరువాత దేశ పార్లమెంట్‌కు సిఫార్సు చేస్తూ తీర్మానం చేశారు. దీనిని అధ్యక్షురాలికి పంపించడం, ఈ మేరకు ఆమె పార్లమెంట్‌ను రద్దు చేయడం వెంటవెంటనే జరిగాయి.

 

అయితే ప్రధాని ఓలి సిఫార్సును అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకించింది. ఇది తొందరపాటు నిర్ణయం అని, ప్రధాని ఓలి హడావిడిగా, మంత్రులంతా అందుబాటులో లేనప్పుడు కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారని కమ్యూనిస్టుపార్టీ అధికార ప్రతినిధి నారాయణ్‌కజి శ్రేష్ట విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని, దేశాన్ని వెనక్కు తీసుకుపోతుందని, సిఫార్సును అమలు చేయరాదని కోరారు. దేశంలో ఇప్పటి పార్లమెంట్ 2017లో ఎన్నికయ్యింది. ప్రతినిధుల సభ దిగువ సభగా ఉంటోంది. ఇందులో సంఖ్యాబలం 275 మంది సభ్యులు. ఇక ఎగువ సభను జాతీయ అసెంబ్లీగా వ్యవహరిస్తారు.

పార్టీ అంతర్గత చిచ్చు కారణం…
పార్లమెంట్ రద్దు నిర్ణయానికి అధికార ఎన్‌సిపిలో అంతర్గత విభేదాలు దరిమిలా తలెత్తిన చిచ్చు కారణం అని భావిస్తున్నారు. పార్టీలో నెలల తరబడి రెంప ప్రధానవర్గాల మధ్య ఉన్న వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక వర్గానికి ప్రధాని ఓలి, మరో వర్గానికి ప్రంచండ సారధ్యం వహిస్తున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఉన్న ప్రచండ ఇంతకు ముందు దేశ ప్రధానిగా వ్యవహరించారు.

President approves dissolution of Nepal’s parliament

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News