Saturday, April 27, 2024

అత్యాచార కేసులో దోషిగా తేల్చిన కోర్టు.. క్రికెటర్ కు 8 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండు: నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచానేకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. మైనర్‌పై అత్యాచారం కేసులో సందీప్‌పై నేరం రుజువు కావడంతో ఖాట్మాండు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ శిక్ష విధించింది. సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో పోలీసులు లామిచానేపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత లామిచానే బెయిల్‌పై విడుదల అయ్యాడు.

కాగా, ఈ కేసులో సందీప్‌ను దోషిగా తేల్చిన కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. మరోవైపు సందీప్ 51 వన్డేలు, మరో 52 టి20లలో నేపాల్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అంతేగాక ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News