- Advertisement -
ఆగ్రా: ఖండౌలి ప్రాంతంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. సుమారు 100 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని ఎట్మాద్పూర్ సర్కిల్ ఆఫీసర్ అర్చన సింగ్ తెలిపారు. అందరూ ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా – ఆగ్రా రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
private bus overturns on Yamuna Expressway in Khandauli
- Advertisement -