Wednesday, May 1, 2024

కరోనా పడకలకు మంగళం!

- Advertisement -
- Advertisement -

Private Hospitals will limit Corona treatment

 

కరోనా రోగుల సంఖ్య గణనీయంగా
తగ్గడంతో పడకల సంఖ్య
తగ్గించేందుకు యాజమాన్యాల యోచన
ఒక్కో ఆసుపత్రిలో 10 మందికి
మించని పేషెంట్లు సాధారణ వైద్య
సేవకే మొగ్గుచూపుతున్న దవాఖానాలు
90శాతం మంది రోగులు
హోం ఐసోలేషన్‌కే మొగ్గు

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కరోనా వైద్యాన్ని పరిమితం చేయనున్నాయి. అన్ని బ్రాంచ్‌లలో కాకుండా ఏదేని ఒక హాస్పిటల్‌లో మాత్రమే కరోనా చికిత్సను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి కొన్ని సింగల్ బ్రాంచ్ కలిగిన హాస్పిటల్స్ కూడా కరోనా వైద్యసేవలను నిలిపివేయాలని భావిస్తున్నాయి.ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 హాస్పిటల్స్ కరోనా వైద్యాన్ని నిలిపివేసినట్లు సమాచారం. మరి కొన్ని ఆసుపత్రులు కూడా ఆ దిశగా అడుగులు వేసేందుకు ముందుకు సాగుతున్నాయి. రోజురోజుకి రోగుల సంఖ్య తగ్గడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఓ కార్పొరేట్ ఆసుపత్రి ఎండి తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 228 ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా వైద్యాన్ని అందిస్తుండగా, ఏకంగా 200 హాస్పిటల్స్‌లో కేవలం 1800 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారు. అంటే ఒక్కోక్క ఆసుపత్రిలో పట్టుమని పది మంది రోగులు కూడా చికిత్స పొందడం లేదని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అది కూడా ఐసియూ సేవలు అవసరమయ్యే పేషెంట్లు మాత్రమే హాస్పిటల్స్‌లో చికిత్స పొంతుతున్నట్లు హెల్త్ బులెటెన్‌లో వెల్లడించారు. ఈక్రమంలో కరోనా వైద్యం అందించేందుకు మూడు నెలల క్రిందట ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక కరోనా వార్డులను తొలగించి, కొన్ని హాస్పిటల్స్ జనరల్ వార్డులుగా మార్చుతున్నాయి. అంతేగాక కార్పొరేట్ ఆసుపత్రులు సైతం ఒకే ఒక్క బ్రాంచ్‌లో కరోనా వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మరి కొన్ని ఆసుపత్రుల్లో “నో కరోనా ట్రీట్మెంట్ ”అనే బోర్డులు కూడా వెలుస్తున్నాయి.

90 శాతం మంది హోం ఐసోలేషన్‌లో మొగ్గు….

కరోనా బాధితుల్లో 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారిన పడిలో వారిలో సుమారు 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు. అంటే వైరస్ తీవ్రత అతి స్పలంగా ఉంటుంది. దీంతో వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అంతేగాక మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వాళ్లూ బ్రీతింగ్ సమస్యలు లేకుంటే ఇళ్ల వద్దనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కేవలం ఆక్సిజన్, ఇతర సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే హాస్పిటల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అది కూడా సర్కార్ దవాఖానాలకు అత్యధిక మంది వెళ్లడం గమనార్హం. ఈక్రమంలో సుమారు 65 ప్రైవేట్ హాస్పిటల్స్ ఐసోలేషన్ వార్డులను, మరో పది హాస్పిటల్స్ ఆక్సిజన్ వార్డులను కూడా ఎత్తివేసినట్లు సమాచారం.

ఒక్కో ఆసుపత్రిలో 10 మంది పేషెంట్లు కూడా లేరు…

రాష్ట్ర వ్యాప్తంగా 228 ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనా వైద్యాన్ని అందిస్తుండగా, ఏ ఒక్క ఆసుపత్రిలోనూ పది మందికి మించి పేషెంట్లు లేరు. వాస్తవంగా రెండు నెలల క్రిందట ప్రైవేట్ హాస్పిటల్స్‌లో బెడ్లు దొరకడం చాలా కష్టతరంగా ఉండేది. అప్పట్లో పైరవీ లేనిదే పరుపు దొరకని పరిస్థితి ఉండేది. దీంతో అనేక ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్ వైద్యాన్ని అందించేందుకు ఆసక్తి చూపి వైద్యశాఖ నుంచి అనుమతులు తీసుకున్నాయి. కానీ ప్రభుత్వం తీసుకున్న ట్రీపుల్ టీ విధానంతో వైరస్ తీవ్రత తగ్గగా, ప్రస్తుతం కరోనా వార్డులన్నీ ఖాళీగా ఉన్నాయి.

సెప్టెంబరు 22వ తేదిన కరోనా చికిత్సను అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌లో 4119 మంది పేషెంట్లు ఉండగా, ఈనెల 22వ తేది వరకు కేవలం 1844 మంది రోగులు మాత్రమే ఉన్నారు. అదే విధంగా సెప్టెంబరు నెలలో 21వ తేదిన 4066 పేషెంట్లు ఉండగా, ఈనెల 21న కేవలం 1861, సెప్టెంబరు 20వ తేదిన 3970 రోగులు ఉండగా, ఈనెల కేవలం 1990 రోగులు మాత్రమే ఉన్నారు. అంటే సుమారు 45 శాతం మంది రోగులు తగ్గారు. మరోవైపు ప్రభుత్వాసుపత్రుల్లోనూ బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం ఆధీనంలో 61 ఆసుపత్రుల్లో కరోనా వైద్యం నిర్వహిస్తుండగా, 40 ఆసుపత్రుల్లో నాలుగు వందల లోపు పేషెంట్లు ఉన్నారు. అంటే ఒక్కోక్క ఆసుపత్రుల్లో పది మంది రోగులు మించడం లేదు.

సాధారణ వైద్యసేవలపై మొగ్గు చూపుతున్న హాస్పిటల్స్….

గతంలో కరోనా వైద్యాన్ని అందించేందుకు ఎగబడిన ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నాయి. రోజువారీ కరోనా రోగులు తగ్గడంతో సాధారణ వైద్యసేవలను మరింత మెరుగు పరిచే పనిలో ప్రైవేట్ హాస్పిటల్స్ నిమగ్నమయ్యాయి. మరోవైపు కరోనా వైద్యానికి నిర్ధిష్ట ధరలు నిర్ణయించి, అధిక ధరలు తీసుకున్న హాస్పిటల్స్‌పై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుండటంతో కూడా కరోనా వైద్యాన్ని అందించేందుకు ఆయా ఆసుపత్రులు భయాందోళనకు గురవుతున్నట్లు వైద్యశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆగస్టు, అక్టోబరు నెలల బెడ్ల వ్యత్యాసం…

తేది                           ఆగస్టు                అక్టోబరు                      వ్యత్యాసం

22                          4119                 1844                         2275
21                          4066                 1861                         2205
20                          3970                 1990                         1980

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News