Sunday, May 12, 2024

‘ఇష్క్’లో మంచి కంటెంట్ ఉంది

- Advertisement -
- Advertisement -

హీరో తేజ సజ్జా, హీరోయిన్ ప్రియా ప్రకాష్ జంటగా నటించిన చిత్రం ‘ఇష్క్’. ఈ చిత్రానికి యస్. యస్. రాజు దర్శకత్వం వహించాడు. ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ‘ఇష్క్’ సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత ఎన్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ “మంచి సినిమా తీశాం. మంచి సినిమాను జనాలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. వంద శాతం ఇది మినిమమ్ గ్యారెంటీ సినిమా. – ఇష్క్ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. యూత్‌కు కావాల్సిన అంశాలు ఉంటాయి. అందుకే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశాం. యస్.యస్ రాజు చక్కగా తెరకెక్కించాడు. మొదటి నుంచి ఈ సినిమాను థియేటర్‌కే అనుకున్నాం. అలానే విడుదల చేస్తున్నాం. ఇక ఆగస్ట్ 13న చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ సినిమా మొదలవుతుంది. ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటాడు మా దర్శకుడు మోహన్ రాజా. అతను ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించబోతున్నాడు”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News