Saturday, April 27, 2024

పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

కొత్తకోట : గ్రామపంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోయేజ్ ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తకోట మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయితీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరపున మద్దతు తెలిపి మాట్లాడారు.

గత నెల రోజులుగా పంచాయితీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని, ఎన్నో ఏళ్లుగా గ్రా మ పంచాయితీలో కార్మికులుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికులకు కనీస వేతనం కింద రూ.19500 ఇవ్వడంతో పాటు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. అదే విధంగా ప్రమాద భీమా కింద రూ. 10 లక్షలు ఇవ్వాలని, ప్రమాదంలో చనిపోయిన కార్మికుడి కుటుంబం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు.

అంతేకాకుండా మల్టీ పర్పస్ విధానాన్ని ర ద్దు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నిక్సన్, గ్రామపంచాయితీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News