Wednesday, May 1, 2024

ఉత్తరాఖండ్ కొత్త సిఎంగా పుష్కర్ సింగ్ ధామి

- Advertisement -
- Advertisement -

Pushkar Singh Dhami as the new CM of Uttarakhand

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి నియమితులయ్యారు. శుక్రవారం సిఎం పదవికి తీరథ్ సింగ్ రావత్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పుష్కర్ సింగ్ ధామిని ఈ రోజు ఉత్తరాఖండ్ బిజెపి శాసనసభ పార్టీ పదకొండవ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. డెహ్రాడూన్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో 57 ఉత్తరాఖండ్ బిజెపి ఎమ్మెల్యేలు సమావేశమైన అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సన్నిహితంగా భావించిన ధామి పేరు ఈ రోజు ప్రకటించబడిందని పార్టీ వర్గాలు తెలిపాయి. 45 ఏళ్ల ధామి, రెండుసార్లు ఎమ్మెల్యే, ఖతిమా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రివేంద్ర సింగ్ రావత్ 2017 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, కొంతమంది బిజెపి ఎమ్మెల్యేలు తన పని తీరు గురించి పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఆయన సిఎం పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్‌లో ఉప ఎన్నికలపై అనిశ్చితి మధ్య తీరత్ సింగ్ రావత్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

Pushkar Singh Dhami as the new CM of Uttarakhand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News