Thursday, May 9, 2024

ప్రజా సమస్యలపై బస్తీల్లో ‘రాగిడి’ పర్యటన

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫమయ్యారని కాంగ్రెస్ ఉప్పల్ నియో జకవర్గ నాయకుడు రాగిడి లకా్ష్మరెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా డివిజన్ పరిధిలోని సాయిబా బానగర్‌కాలనీ, నూధ్యందిరనగర్‌కాలనీల్లో మేడ్చల్ జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ పత్తికుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు,కాలనీవాసులతో కలిసి లకా్ష్మరెడ్డి పర్యటించారు.

కాలనీల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ముఖ్యంగా డ్రైనేజీ సమస్య తలెత్తడంతో కొన్ని రోజులుగా మురుగునీరు ఎరులై పారుతుందని దింతో డెంగ్యూ, మలేరియ వంటి వ్యాధులు ప్రభలే అవకాశముందని అన్నారు. అలాగే రోడ్డు పూర్తిగా పాడైన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో స్థ్ధానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు విఫలమయ్యారన్నారు.

కాప్రా డివిజన్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న సమస్యలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలోని ప్రతికాలనీలో పర్యటిస్తానని ఆయన తెలిపారు.సాయిబాబానగర్ కాలనీలో డబుల్ బెడ్‌రూంలు నిర్మించి ఐదు సంవత్సరాలు గడస్తున్న కేటాయించకుండ నిరుపయోగంగా ఉంచారని అన్నారు. లేకుంటే కలెక్టరెట్‌ను ముట్టడిస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాఘవరెడ్డి, అంజిరెడ్డి, పెద్ది శ్రీనివాస్, పోచయ్యగౌడ్, గోపాల్‌యాదవ్,అంజయ్య, సంజీవరెడ్డి, మైనార్టీ చైర్మన్ అబ్దుల్ రషీద్ అషు, అనిల్, ఉమేష్‌గౌడ్, మేడ్చల్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్, నాయకలు జహీరోద్దిన్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News