Saturday, April 27, 2024

నిర్దోషిని ..పార్లమెంట్‌కు అనుమతించండి:

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మోడీ ఇంటి పేరుపై తనపై దాఖలు అయిన పరువు నష్టం దావాలో తాను నిర్దోషిని అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. తనపై పెట్టింది రాజకీయ వేధింపుల అసాధారణ కేసు అయిందని పేర్కొన్నారు. తన ఎంపి సభ్యత్వ రద్దు తీర్పుపై స్టే విధించి తాను ప్రస్తుత లోక్‌సభ సెషన్‌కు హాజరు అయ్యే అవకాశం కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టులో సంబంధిత కేసుపై రాహుల్ తన తరఫు లాయర్ల ద్వారా అఫిడవిట్ దాఖలు చేశారు. తనపై పెట్టింది కేవలం దురుద్ధేశపూరిత వేధింపుల కేసు అని, దీని నుంచి తనకు న్యాయం కల్పించాల్సి ఉందని అభ్యర్థించారు. ఓ ఎంపిగా తనకు ఈ కేసు విషయంలో తీరని నష్టం జరిగిందని ,

తనను ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజల తరఫున తాను ఎంపిగా లోక్‌సభకు హాజరు కాలేని సంకట స్థితి ఏర్పడిందని తెలిపారు. కేసులో శిక్షపడ్డా ఇప్పటికీ రాహుల్ పొగరుగా ఉన్నారని తనపై కేసుకు దిగిన గుజరాత్ బిజెపి ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ వాదన పూర్తిగా ద్వేషపూరితం అన్నారు. ఈ కేసులో తాను బాధితుడినని , పైగా తాను క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం పూర్తిగా న్యాయ ప్రక్రియను దుర్వినియోగపర్చడమే అవుతుందన్నారు. తనకు ఫిర్యాదీపై ఎటువంటి కక్ష లేదన్నారు. తన దోషిత్వ ఖరారు నిలవజాలదని, తాను నేరం చేసినట్లు అయితే ఇంతవరకూ తాను ఆగేవాడిని కాదని , ముందుగానే క్షమాపణలు చెప్పేవాడినని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News