Saturday, May 4, 2024

చైనా చొరబడుతుంటే మోడీ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi slams PM Modi on China issue

 కేంద్రాన్ని నిలదీసిన రాహుల్
ఇటువంటి విషయాలు ట్విట్టర్‌లో ప్రశ్నిస్తారా: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : లడాఖ్‌లోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ దీనిపై పెదవి విప్పడంలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనా భారత భూభాగంలోకి చొరబడి మన భూభాగాన్ని ఆక్రమించుకుందని, ఇంత జరుగుతున్నపటికీ ప్రధా ని మోడీ మౌనాన్ని ఆశ్రయిస్తూ అదృశ్యమైపోయారని బుధవారం ట్విట్టర్ వేదికగా రాహుల్ ఆరోపించారు. రెండు దేశాల మధ్య సైనిక స్థాయి చర్చలలో చైనా మొండి వైఖరిని ప్రదర్శించిందని, గల్వాన్ లోయతోపాటు, పాంగాంగ్‌లోని కొన్ని ప్రాంతాలు తమకు చెందినవేనంటూ వాదించిందని పేర్కొం టూ వెలువడిన ఒక పత్రికా కథనాన్ని కూడా రాహుల్ తన ఆరోపణలతో జతచేశారు. సరిహద్దు వివాదంపై మోడీ ప్రభుత్వం నిజాలు వెల్లడించాలని, లడాఖ్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదీ లేనిదీ బయటపెట్టాలని రాహుల్ ఇదివరకు కూడా డిమాండ్ చేశారు.

రాహుల్‌కు కేంద్రమంత్రి హితవు

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సరిహద్దు వివాదంపై చేసిన ఆరోపణలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెంటనే స్పందించారు. అంతర్జాతీయ వ్యవహారాలను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించడం సబబు కాదని ఆయన రాహుల్‌కు హితవు చెప్పారు. చైనా వంటి అంతర్జాతీయ వ్యవహారాలను ట్విట్టర్ ద్వారా ప్రశ్నించడం తప్పని రాహుల్ గ్రహించాలని కేంద్ర మంత్రి చెప్పారు. బాలాకోట్‌పై వైమానిక దాడులు, 2016నాటి యురి దాడులు జరిగిన సందర్భంగా సాక్షాలు చూపాలని అడిగింది రాహుల్ గాంధీయేనని ఆయన ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News