Tuesday, April 30, 2024

సెంట్రల్ విస్టా కాదు.. దార్శనిక ప్రభుత్వం ఇప్పుడు అవసరం

- Advertisement -
- Advertisement -

సెంట్రల్ విస్టా కాదు..దార్శనిక ప్రభుత్వం ఇప్పుడు అవసరం
మోడీ సర్కార్‌పై రాహుల్ విసుర్లు

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారితో దేశం తల్లడిల్లుతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా బుధవారం మరోసారి ధ్వజమెత్తారు. దేశానికి ఇప్పుడు సెంట్రల్ విస్టా ప్రాజెక్టు(నూతన పార్లమెంట్ భవన సముదాయం) అవసరం లేదని, దార్శనికత గల కేంద్ర ప్రభుత్వం అవసరమని రాహుల్ వ్యాఖ్యానించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్టును ప్రకటించింది. ముక్కోణం ఆకృతిలో నిర్మించే ఈ నూతన పార్లమెంట్ భవనంలో 900 నుంచి 1200 మంది ఎంపీలు కూర్చునే విధంగా సీటింగ్ ఉంటుంది. దేశం 75 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా 2022 ఆగస్టులో దీని నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024లోగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దేశం ప్రస్తుతం కరోనా కల్లోలాన్ని ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరం ఏమిటని రాహుల్ ప్రశ్నిస్తున్నారు.

కాగా..సామాన్య ప్రజలు పరస్పరం సాయమందించుకోవడాన్ని రాహుల్ మరో ట్వీట్‌లో అభినందించారు. ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడం ద్వారా మనసులు గెలుచుకోవడానికి చేతులు స్పృశించవలసిన అవసరం లేదని సామాన్య ప్రజలు చాటుతున్నారని, ఇది ఇలాగే కొనసాగాలని రాహుల్ ఆకాంక్షించారు. ప్రజలు పరస్పర సహకారాన్ని కొనసాగిస్తూ గుడ్డి వ్యవస్థ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని పిలుపునిచ్చారు.

Rahul Gandhi slams to PM Modi over corona crisis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News