Monday, May 6, 2024

మణిపూర్ బాధితులకు రాహుల్ పరామర్శ

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిసూర్‌లోని బిష్ణుపూర్ జిల్లా మొయిరంగ్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం సందర్శించినట్లు కాంగ్రెస వర్గాలు తెలిపాయి.

ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంఫాల్ నుంచి హెలికాప్టర్‌లో రాహుల్ గాంధీ అక్కడి సహాయక శిబిరాలలో ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ సందర్శించిన సహాయ శిబిరాలలో దాదాపు 1,000 మంది బాధితులు ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీ వెంట మణిజూర్ మాజీ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, సిసిసి అధ్యక్షుడు కీషం మేఘచంద్ర సింగ్, ఎంపి అజయ్ కుమార్ ఉన్నారు.

చారిత్రకంగా ప్రసిద్ధిపొందిన మొయిరంగ్ పట్టణంలోనే 1944లో భారతీయ త్రివర్ణ పతాకాన్ని ఐఎన్‌ఎ ఆవిష్కరించింది. ఇంఫాల్‌లో మధ్యాహ్నం మేధావులు , పౌర సమాజ ప్రతినిధులతో కూడా రాహుల్ సమావేశమవుతారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మణిపూర్ చేరుకున్న రాహుల్ చురచంద్‌పూర్‌లోని సహాయ శిబిరాలను సందర్శించి బాధితులను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News