Thursday, May 16, 2024

కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు: వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

Railway coach factory not give to Kajipet

 

హైదరాబాద్: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కనుచూపు మేరలో వచ్చే అవకాశం లేదని, ఎప్పటికీ రాదని చెప్పడానికి వాళ్లెవరని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇందిరాపార్కు దగ్గర కాజేపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డివిజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరనసన దీక్ష చేపట్టారు. బోడో ల్యాండ్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారని, మనకెందుకు ఇవ్వరని అడిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగామని ఎందుకు ఇవ్వలేదని మోడీ ప్రభుత్వాన్ని అడిగారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News