Wednesday, May 8, 2024

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

Rains in many parts of state in next 48 hours

వడగండ్ల వానలు.. పిడుగుపాట్లు ఉన్నాయ్ జాగ్రత్త!
వాతావరణకేంద్రం వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభాంతో రాష్ట్రంలో రానున్న 48గంటల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు ,మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి రెండు చోట్లు పిడుగులు పడే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరించింది. వరంగల్ ,ఖమ్మం, నిజామబాద్ , నిర్మల్ , సంగారెడ్డి, వరంగల్ ,జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. కొమరంభీ జిల్లా బిజ్జూర్‌లో అత్యధికంగా 63.6 మిమి వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఒకమోస్తరు వర్షాలు కురిశాయి.

ఖమ్మంలో 54, పర్వత నగర్‌లో 45.2, కల్వకుర్తిలో 42.4, చిల్కూర్‌లో 35.8, మట్టపల్లిలో 35.4, హూజూర్ నగర్‌లో 32.6, కొల్లాపూర్‌లో 30.2, నాగర్ కర్నూల్‌లో 27.4 చింతకంలో 23.2, ములుగులో 22.4,ఇటిక్యాల్‌లో 21.2, శ్రీరాంపూర్‌లో 18.4, మహేశ్వరంలో 16.6, పెద్దపల్లిలో 16.4, దేవరుప్పల్‌లో 16.4, వంగూర్‌లో 16.2,కోదాడలో 15.6, హన్మకొండలో 15.4, కొత్తపల్లెలో 15.2, జడ్చర్లలో 15.2, సూర్యాపేటలో 14.6, కొన్జెర్లలో 13,వరంగల్‌లో 12, దేవరకొండలో 11.2, పెద్దమందడిలో 11, గుడుర్వాగల్‌లో 10.8 యాచారంలో 10.7, ఆత్మకూర్‌లో 10.6,మొగుళ్లపల్లిలో 10.4మి.మి వర్షం కురిసింది. మిర్యాలగూడ, అశ్వారావుపేట, రామన్నపేట, మహబూబాబాద్ , పరకాల, సుల్తానాబాద్, పాలకుర్తి, వనపర్తి, చెన్నూర్, మానోపాడ్, డోర్నకల్, నల్గొండ, భూపాలపల్లి, మహబూబ్ నగర్, అచ్చంపేట, కొత్తగూడెం, కూసుమంచి, మణుగూరు, మధిర తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మరోవైపు పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 41డిగ్రీలు పైగానే ఉన్నాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 41.4, అదిలాబాద్‌లో 41,మెదక్‌లో 40.7, ఖమ్మంలో 40.4, హైదరాబాద్‌లో 38, అత్యల్పంగా మెదక్‌లో 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News