Friday, April 26, 2024

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో మూవీ ఫిక్స్..

- Advertisement -
- Advertisement -

 

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ మూవీ కోసం ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లకు రాజమౌళి, మహేష్ బాబుల చిత్రం కన్ఫామ్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కెఎల్ నారాయణ నిర్మాతగా మహేష్‌తో ఓ సినిమాను తీయనున్నట్లు రాజమౌళి స్పష్టం చేశారు. దీంతో మహేష్ బాబు అభిమనుల అనందంలో మునిగితేలుతున్నారు. కాగా, రాజమౌళి ప్రస్తుతం స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ఆర్ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. 1920 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ఇదివరకే ప్రకటించింది.

Rajamouli Confirms his next movie with Mahesh Babu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News