Friday, April 26, 2024

మొదటి నుండి నా విజయ యాత్రలో తోడుగా ఉన్నావు

- Advertisement -
- Advertisement -

Rajamouli said Birthday wishes to NTR

 

దర్శక ధీరుడు రాజమౌళి తన సన్నిహితుడు, ఫేవరేట్ స్టార్ ఎన్టీఆర్‌కి బర్త్ డే విషెస్ తనదైన శైలిలో చెప్పారు. వీరిద్దరూ మొదటి సినిమా కోసం పనిచేసినప్పటి ఫోటో పంచుకొని రాజమౌళి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. 2001లో ఎన్టీఆర్ రెండవ సినిమాగా వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ రాజమౌళికి దర్శకుడిగా మొదటి సినిమా. ఎన్టీఆర్ ఫస్ట్ హిట్ మూవీ ‘స్టూడెంట్ నంబర్ వన్’ కావడం విశేషం. ఈ చిత్ర షూటింగ్ సమయంలో సెట్స్‌లో ఎన్టీఆర్‌ని కౌగిలించుకొని దిగిన ఫొటోను రాజమౌళి సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

“మొదటి నుండి నా విజయ యాత్రలో తోడుగా ఉన్నావు… చాలా సంతోషం. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. నీకన్నా ఉత్తమైన భీమ్ నాకు దొరకడు” అని రాజమౌళి కొంచెం ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు. రాజమౌళి మొదటి రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి ఎన్టీఆర్‌తోనే చేశారు. ఇక 2007లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘యమదొంగ’ మూడవ చిత్రం. ఆ చిత్రం విడుదలైన 13 ఏళ్లకు ఎన్టీఆర్, రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కలిసి పనిచేస్తున్నారు. రాజమౌళితో 4వ సినిమా చేస్తున్న ఏకైక హీరో ఎన్టీఆర్ కావడం విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News