Tuesday, April 30, 2024

సచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఏలకు హైకోర్టులో ఊరట

- Advertisement -
- Advertisement -

Rajasthan High Court stays Speaker disqualification notice

లక్నో: రాజాస్థాన్ మాజీ డిప్యూటీ సిఎం సిచిన్ పైలట్ వర్గ ఎంఎల్ఎలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎంఎల్ఎలపై చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో సిఎం అశోక్ గెహ్లాట్ వర్గం నాయకుల ఫిర్యాదుతో 19 మంది ఎంఎల్ఎలకు స్పీకర్ అనర్హత వేటు వేశారు. దీంతో స్పీకర్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం ఎంఎల్ఎలు హైకోర్టులో పిటిషన్ వేశారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దని స్పీకర్ కు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని స్పీకర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజస్థాన్ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇవ్వొచ్చని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్పీకర్ లేవనెత్తిన అంశాలపై సుదీర్ఘ విచారణ చేపట్టనున్నట్టు సుప్రీం తెలిపింది. ఈ నెల 27న స్పీకర్ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది.

Rajasthan High Court stays Speaker disqualification notice

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News