Home తాజా వార్తలు బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

Rajasthan won toss and opted to bat against RCB

దుబాయ్: బెంగళూరుపై టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐపిఎల్ -2020లో శనివారం రెండు మ్యాచ్ లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో బెంగళూరు-రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్ తీసుకుంది. బెంగళూరు జట్టులో షాబాజ్ అహ్మద్, గుర్ కీరత్ సింగ్ మాన్ లను తీసుకున్నారు. శివం దూబే, మహ్మద్ సిరాజ్ లను పక్కన పెట్టారు. ఇక రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ టోర్నీలో ఇప్పటివరకు బెంగళూరు జట్టు ఎనిమిది మ్యాచ్ లు ఆడి 5 మ్యాచుల్లో గెలవగా, రాజస్థాన్ జట్టు 8 మ్యాచులు ఆడి ఐదు ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీదే పైచేయిగా కనిపిస్తోందని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు.

Rajasthan won toss and opted to bat against RCB