Sunday, April 28, 2024

కర్ణిసేన చీఫ్‌ను కాల్చి చంపిన దుండగుడి ఇల్లు కూల్చివేత

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితుల్లో ఒకరయిన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. అక్రమంగా నిర్మించారంటూ ఖతిపురలోని రాథోడ్ ఇంటిని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌అధికారులు బుల్‌డోజర్లతో కూల్చివేశారు. ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ కాల్పుల ఘటనలో నిందితులయిన రోహిత్ రాథోడ్, నితిన్ ఫౌజీలతో పాటుగా వారి సహచరుడు ఉద్ధమ్‌ను చండీగఢ్‌లో ఈ నెల 9న అరెస్టు చేశారు. కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్‌ను డిసెంబర్ 5న ఆయన నివాసంలోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన సిసిటీవీలో సైతం రికార్డయింది ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గాదర సుఖ్‌దేవ్ హత్యకు తానే బాధ్యుడని ఒక ఫేస్‌బుక్ పోస్టులో ప్రకటించుకున్నాడు కూడా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News