Friday, April 26, 2024

రొమాంటిక్ సాంగ్ కోసం భారీ సెట్..

- Advertisement -
- Advertisement -

Ram Charan and Alia Bhatt Romantic song in RRR

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం చరణ్, అలియా భట్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. సాబు సిరిల్ నేతృత్వంలో ఓ భారీ సెట్‌ను కూడా ఈ సాంగ్ కోసం వేశారట. ఇదిలా ఉండగా ఈ షెడ్యూల్ లో కేవలం ఒక్క సాంగ్ మాత్రమే కాకుండా కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ సహా మరికొందరు కీలక నటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు.

Ram Charan and Alia Bhatt Romantic song in RRR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News