Tuesday, April 30, 2024

మరోసారి కలిసి నటించనున్న చిరు, చరణ్..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ఇద్దరు తమ తమ సినిమాలుతో బిజీగా ఉన్నారు. చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ లాంటి భారీ మల్టీస్టారర్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తుండగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ ఆచార్య’ చిత్రం చేస్తున్నాడు చిరంజీవి. అయితే ‘ఆచార్య’లో చిరుతో పాటు చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనున్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా ఈ చిత్రం అనంతరం చిరుతో చరణ్ మరోసారి స్క్రీన్‌ను పంచుకొనే అవకాశం ఉందని సమాచారం. ‘ఆచార్య’ తర్వాత చిరు రెండు రీమేక్ చిత్రాలను లైన్‌లో ఉంచాడు. వాటిలో ‘లూసిఫర్’ రీమేక్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో కూడా చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు వి.వి.వినాయక్ స్క్రిప్ట్‌వర్క్ ను పూర్తి చేసేసి చిరును మెప్పించినట్టు సమాచారం. మరి నిజంగానే ఈ చిత్రంలో చరణ్ ఉన్నాడా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Ram Charan to play key role in Lucifer Remake

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News