Sunday, April 28, 2024

అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితమవుదాం: రాష్ట్రపతి కోవింద్

- Advertisement -
- Advertisement -

Ram Nath Kovind says Ramadan wishes

 

న్యూఢిల్లీ: సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం పునరంకితం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ పిలుపునిచ్చారు. ఈద్‌ఉల్‌ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి నిదర్శనమని రాష్ట్రపతి గుర్తు చేశారు. దేశ, విదేశాల్లోని భారతీయులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్19 వల్ల బాధితులుగా మారుతున్నవారి పట్ల జకాత్(దానగుణం)ను స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్రపతి కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి భౌతిక దూరంలాంటి జాగ్రత్తలు పాటించాలని రాష్ట్రపతి సూచించారు. రాష్ట్రపతి భవన్ ఈ సందేశాన్ని ఆదివారం విడుదల చేసింది. ఈద్‌ను భారత్‌లోని చాలా చోట్ల సోమవారం జరుపుకోనున్నారు. జమ్మూకాశ్మీర్, కేరళలో మాత్రం ఆదివారమే జరుపుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News