Saturday, April 27, 2024

అంతకుముందే మా మధ్య ప్రేమ పుట్టింది

- Advertisement -
- Advertisement -

Rana Daggubati said about his Love

 

సోషల్ మీడియాలో గత వారం రోజులుగా వినిపిస్తున్న పేరు మిహిక బజాజ్. టాలీవుడ్ బ్యాచిలర్ హీరో రానా మిహికతో ప్రేమలో పడగా… వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. దీంతో మిహిక పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఇక ఈ ఏడాదే ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటి కాబోతున్నారట. అసలు మిహికతో ఎలా పరిచయం ఏర్పడింది? పరిచయం ప్రేమ వరకు ఎలా వెళ్లింది? అనే విషయాలను తాజాగా మంచు లక్ష్మితో రానా ఇన్‌స్టాగ్రామ్‌లో బయట పెట్టాడు. వీరి సంభాషణలో హీరో వెంకటేష్ కూతురు.. తన చెల్లి అశ్రిత పేరు బయటకొచ్చింది.

మిహికా బజాజ్ వెంకీ కూతురు అశ్రిత బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని.. ఆ కారణంగానే మిహికాతో రానా పరిచయం జరిగిందట. అంతేకాకుండా రానా, మిహికాల ప్రేమ విషయం అశ్రితకు ముందే తెలుసట. రానాకు చెల్లి అశ్రిత బాగా సపోర్ట్ చేసిందని తెలిసింది. అయితే తమ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రం లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు పుట్టిందని రానా తెలిపాడు. తన ప్రేమను మిహికా అంగీకరించడంతో పెద్దలకు చెప్పి ఒప్పించి పెళ్లి వరకు తీసుకెళ్లామని ఆయన వెల్లడించాడు. మిహికా తన ఫ్యామిలీకి పరిచయం ఉన్న అమ్మాయేనని రానా అన్నాడు. అంతేకాకుండా ఆమెకు ముంబయ్‌లో ఉన్న తన ఫ్రెండ్స్ కూడా తనకు స్నేహితులు కావడం కూడా తామిద్దరి మధ్య బంధం ఏర్పడటానికి కారణమైందని రానా చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News