Wednesday, May 1, 2024

రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Ramalingareddy is great personality: KTR

హైదరాబాద్: సోలిపేట రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఎంఎల్‌ఎ సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానాన్ని సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టారు. సోలిపేట మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కెటిఆర్ సభలో మాట్లాడారు. రామలింగారెడ్డి నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని, అందరితో కలుపుగోలుగా ఉండే వారని, కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి అని ప్రశంసించారు. దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి అయితేనే న్యాయం చేస్తారని, నాడు పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ భావించారని, 2004లో దొమ్మాట టికెట్ కోసం ఎంతో మంది ప్రయత్నించినా సిఎం కెసిఆర్ పట్టుబట్టి రామలింగారెడ్డికే టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉన్నారని మెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News