Wednesday, May 1, 2024

నేడు రాష్ట్రపతి రాక

- Advertisement -
- Advertisement -

 

Ramnath Kovind to inaugurate National Cultural Festival at NTR Stadium

ఎన్‌టిఆర్ స్టేడియంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభించనున్న రాంనాథ్ కోవింద్

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎన్‌టి ఆర్ స్టేడియంలో జరగనున్న జాతీయ సాంస్కృతిక కార్యక్రామాలను ప్రారంభించేందుకు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. కేంద్ర సాం స్కృతిక శాఖామంత్రి జి.కిషన్ రెడ్డితో కలిసి శుక్ర వారం సాయంత్రం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించనున్నారు. రెండు రోజుల పా టు జరగ నున్న ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ఘ నంగా చేస్తు న్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేస్తున్నారు. చేనేత కళాకారులు, హస్తకళా ని పుణులు వివిధ రకాల వస్త్రాలనూ, హస్తకళా వస్తు వుల నూ, దేశ వ్యాప్తం గా లభ్యమయ్యే పలు రకాల వంటలనూ, నిల్వ ఉండే ఆ హార పదార్థాలనూ విక్రయించేందుకుగాను 200లకు పైగా టెంట్ల ఆకారంలో స్టాళ్ళ ను నిర్మిస్తున్నారు.

పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల కోసం వేదికను కూ డా సిద్ధం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా., అన్ని రాష్ట్రాలనుండి చేనేత కార్మికు లూ, హస్తకళా నిపుణులు, నాటక బృందం వారు, సంగీత సాహి త్య కళా కారులూ హాజరుకానున్నట్లు జాతీయ సాంస్కృతిక మహోత్సవం ఈవెంట్ మేనేజర్ సుశీల్ లాల్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్‌టిఆర్ గ్రౌం డ్స్‌లో స్టాళ్ళ చుట్టూ, వేదిక మీదా తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రక రకాల పెయిం టింగ్ లు వేస్తున్నారు. ఈ వాతావరణాన్ని తీర్చిదిద్దడం కోసం జంటనగ రాల్లో ఓల్డ్ సిటీ నుంచి వచ్చిన పెయింటర్ల బృందం పల్లె వాతావరణం ఉట్టిపడే లాంటి అందమైన చిత్రా లను, జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోగోను పలు రకాల పెయింట్లతో గీస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News