Monday, April 29, 2024

డ్రగ్స్‌కు బిటెక్ విద్యార్థి బలి

- Advertisement -
- Advertisement -

Engineering student dies after overdosing on drugs

మత్తు కోసం మోతాదు మించి సేవించడంతో మృతి

ప్రేమ్ ఉపాధ్యాయ అనే డ్రగ్స్
అమ్మకందారుని అరెస్టు చేయడంతో
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన
ఉదంతం
మాదకద్రవ్యాల వల్ల సంభవించిన
తొలి మరణం నల్లకుంట,
జూబ్లీహిల్స్ కేసుల్లో ఆరుగురు అరెస్టు
డ్రగ్స్ సేవిస్తున్న నలుగురిపై కేసులు
భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం
హైదరాబాద్‌కు చెందిన డ్రగ్స్ డీలర్స్
లక్ష్మీపతి వద్ద హష్ ఆయిల్ కొనుగోలు
చేసి రెట్టింపు ధరకు అమ్మకం

మన తెలంగాణ/హైదరాబాద్ : మాదక ద్రవ్యాలకు బానిసైన ఇంజినీరింగ్ విద్యార్థి డ్రగ్స్ మోతాదుకు మించి తీసుకోవడంతో మృ తి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రెండు రోజుల కిందట నల్లకుంట పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేయగా మోతాదు కు మించి డ్రగ్స్ తీసుకున్న బిటెక్ విద్యార్థి మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో శివమ్‌రోడ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉపాధ్యాయ అనే వ్యక్తిని రెండు రోజుల కిందట పోలీసుల అరెస్టు చేశామన్నారు. అతడి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేశామని, అ యితే ఈ నలుగురూ తరచూ గో వా వెళ్తుంటారని, వీరితో పాటు మరో బీటెక్ విద్యార్థి గోవా వెళ్లాడ ని తెలిపారు. ఈక్రమంలో ఒకేసారి ఎక్కువ మత్తు కోసం సదరు బిటెక్ విద్యార్థి రకాల డ్రగ్స్‌ను మో తాదుకు మించి తీసుకున్నాడని, దీంతో విద్యార్థి మెదడు స్తంభించి వింతగా ప్రవర్తించసాగాడన్నారు. కుటుంబసభ్యులు ఈనెల 19న నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ ఏమాత్రం కోలుకోలేదని, ఈ నేపథ్యంలో చికిత్స పొందుతూ ఈనెల 23న మృతి చెందాడన్నారు. బిటెక్ విద్యార్థితో పాటు గోవాకు వెళ్లిన మిగతా యువకులు అనారోగ్యానికి గురయ్యారని వివరించారు.

మోతాదు మించడం వల్లే మరణం: నిమ్స్ వైద్యులు

నగరానికి చెందిన బిటెక్ విద్యార్థి మోతాదుకు మించిన పలు రకాల మత్తు పదార్థాలు సేవించటం వలే సదరు విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడని ఆ విద్యార్థికి చికిత్స అందించిన నిమ్స్ వైద్యులు వెల్లడించారు. మొదట అతడి పరిస్థితి తమకు అర్థం కాలేదని తన స్నేహితులను ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చిందని వెద్యులు తెలిపారు. మత్తు మోతాడు ఎక్కువ కావటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి శరీరంలోని అవయవాలన్ని పనిచేయటం మానేశాయన్నారు. సదరు విద్యార్థి ఏళ్లుగా మత్తు పదార్ధాలు సేవిస్తుండటం వల్లే తీవ్ర అనారోగ్యం పాలయ్యాడని వైద్యులు పేర్కొన్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన విద్యార్థిని అతని తండ్రి ఈనెల19న నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవల నిమిత్తం చేర్పించారు. అయితే తొలుత ఆ విద్యార్థి డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు వైద్యులకు చెప్పలేదు. కాగా విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు అతని మిత్రులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బిటెక్ విద్యార్థి ఎల్‌ఎస్‌డితో పాటు మద్యం, కెనలబిస్‌లను ఏకకాలంలో సేవించాడని తెలిపారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంపాలైన

యువకునికి బ్రెయిన్

సో స్ట్రోక్స్ వచ్చాయి. విచిత్ర ప్రవర్తనతో పాటు శరీర అవయవాలు పనిచేయడం మానేశాయి. చికిత్స పొందుతూ ఈనెల 23న యువకుడు మృతి చెందాడు.

డ్రగ్స్ స్వాధీనం 

గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నల్లకుంటలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.డ్రగ్స్ విక్రయిస్తున్న ప్రేమ్ ఉదయ్‌కుమార్ అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. 6 ఎల్‌ఎస్‌డి బోల్ట్స్, 10ఎక్సాటిపిపిల్స్, 100గ్రాముల హాష్ ఆయిల్, 4 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా మృతి చెందిన విద్యార్థి మొదట డ్రగ్స్‌కు బానిసై కాలక్రమంలో డ్రగ్స్ విక్రయాలు సాగించినట్లు పోలీసులు వివరిస్తున్నారు. ముఖ్యంగా గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారిలో మృతిచెందిన యువకుడు కూడా ఉన్నాడని, అతనితో పాటు మరో ముగ్గురిని నార్కొటిక్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మృతిచెందిన విద్యార్ధి ఇతర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్మేవాడని పోలీసులు చెబుతున్నారు.అలాగే డ్రగ్స్ విక్రయాలు సాగిస్తున్న శ్రీరామ్ అనే వ్యక్తిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా శ్రీరామ్ అనే నిందితుడు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి డిఎంటి డ్రగ్స్‌ను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు శ్రీరామ్‌తో పాటు దీపక్‌కుమార్ ను అరెస్ట్ చేసి వీరి నుంచి 8 గ్రాముల డిఎంటి డ్రగ్స్,తయారీ సామాగ్రి, 2 సెల్ ఫోన్. రూ. 1.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో రామకృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడని, నార్సింగికి చెందిన నిఖిల్ జాషువా గిటార్ టీచర్, జీవన్ రెడ్డి ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

విచారణలో ఆసక్తికర విషయాలు 

డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు అసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా నిందితులు నగరానికి చెందిన డ్రగ్స్‌డీలర్ లక్ష్మిపతి వద్ద హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. రూ.1,500లకు కొనుగోలు చేసి అవసరం ఉన్న వారికి రూ.3,000లకు విక్రయిస్తున్నారు. తరచూ గోవాకు వెళ్లి అక్కడ నుంచి ఒక ఎల్‌ఎస్‌డిని రూ.1,000లకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.3,000లకు విక్రయిస్తున్నారు. మార్కెట్ వద్ద డ్రగ్స్ విక్రయించేందుకు వేచి చూస్తుండగా ప్రేమ్‌ఉపాధ్యాయ్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా మిగతా వారి వివరాలు తెలిసాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం నల్లకుంట పోలీసులకు అప్పగించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న నిందితుడిని, డ్రగ్స్ తీసుకుంటున్న ఒకరిని నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, జూబ్లీహిల్స్ పోలీసులు కలిసి అరెస్టు చేశారు. నగరంలోని కొండాపూర్‌కు చెదిన శ్రీరాం డ్రగ్స్ విక్రయిస్తున్నాడు, బొల్లారానికి చెందిన దీపక్ కుమార్ జాదవ్ కస్టమర్ సర్వీస్‌లో పనిచేస్తునన్నాడు. సూర్యపేటకు చెందిన శ్రీరాం కొండాపూర్‌లో ఉంటున్నాడు. కాలేజీ సమయంలో డ్రగ్స్ తీసుకునేవాడు. తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు ఇంటర్‌నెట్‌లో చూసి డ్రగ్స్ తయారీ చేయడం నేర్చుకున్నాడు. డ్రగ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలను అమేజాన్, ఇండియా మార్ట్, ల్యాబరేటరీ షాపుల్లో కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News