Friday, May 3, 2024

రెప్పవాల్చిన రెండు వేల నోటు

- Advertisement -
- Advertisement -

రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. అనగా సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోటు దేశంలో చెల్లదని గాని, దానిని దగ్గర పెట్టుకున్న వాళ్ళు నేరస్థులని గాని ఆర్‌బిఐ ప్రకటించలేదు. కరెన్సీ క్లీన్ పాలసీ కింద వీటిని ఉపసంహరించుకుంటున్నామని మాత్రం ఆర్‌బిఐ ప్రకటనలోని సారాంశం. సాధారణంగా 56 ఏళ్ళ కాలం చలామణి అయిన నోటు వాడకం వల్ల కాగితం మెత్తబడి చినిగే అవకాశం వుంటుంది. అదే క్రమంలో రెండు వేల నోటును సైతం వెనక్కి తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ప్రింటయిన మొత్తం 2 వేల నోట్లలో 86% రిజర్వు బ్యాంకు ఖాతాలో చెలామణిలో లేకుండా పోయాయి. మిగతా వాటిని కూడా సేకరిస్తే ఆ నోటు పై ఒక న్యాయ సమ్మత నిర్ణయం తీసుకోవచ్చు.

రెండు వేల రూపాయల కరెన్సీ నోటు రాకనే ఓ ఆపత్కాల అయోమయ సందర్భం. నవంబర్ 2016లో పిడుగు పడ్డట్లు కేంద్ర ప్రభుత్వం రూ. 500/, రూ.1000/ నోట్లను రద్దు చేయడంతో చలామణిలో వున్న కరెన్సీలో 89% నోట్లు చెల్లనివయ్యాయి. అప్పటి దాకా అయిదు వంద నోట్లకు బదులు ఒక రూ.500 నోటు తేలిక కావడంతో రూ. 500 / నోట్లకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చేసింది. అలాంటిది తెల్లవారితే రూ.500, 1000 నోట్లు బ్యాంకుల్లో తప్ప ఎక్కడా పనికి రావని రాత్రి వేళ ప్రధాని ప్రకటిస్తే ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు అంతా ఇంతా కాదు. ఆ రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే జనం అవసరాలను తీర్చేందుకు రూ. 2000 నోటు కరెన్సీలో చేరింది. 2016 చివరిలో ఎటిఎంల ముందు బారులు తీరిన జనానికి దైవ దర్శన ప్రసాదంలా ఒకరికి ఒక్క నోటు మాత్రమే అన్నట్లు రూ.2000 నోటు చేతికొచ్చింది. దానిని పూర్తిగా వాడవలసిందే గాని సగం విలువ సరుకు కొంటే మిగితా డబ్బు లిచ్చే దుకాణదారు దేశంలోనే అప్పుడు లేకుండెను. పెద్ద మొత్తాలకు పనికి వచ్చేలా, కరెన్సీ చెలామణి లెక్క సరిపోయేలా రికార్డుల కోసం మాత్రం రూ. 2000 నోటు సృష్టి పని కొచ్చింది. నోట్ల రద్దు వేళ ప్రజల ఇక్కట్లను తీర్చడంలో దాని పాత్ర శూన్యమనే చెప్పాలి.

అలా ఆరో వేలుగా పుట్టుకొచ్చిన రూ. 2 వేల నోటు ప్రింటింగ్‌ను 201819 ఆర్థిక సంవత్సరంలోనే నిలిపి వేశారు. 2017లో కరెన్సీలో 50% ఆక్రమించిన రూ. 2000/ కొత్త రూ. 500 నోట్ల రాకతో క్రమంగా కుంచించుకుపోయింది. దాని స్థానం మార్చి 2018లో 37.3% నుండి మార్చి 2023 నాటికి కేవలం 10.8 % కి దిగిపోయింది. సాధారణ ప్రజలకు అది వున్నా లేకున్నా ఒకటే అనే స్థాయికి అది చేరిందనవచ్చు. నిజానికి ఆ నోటు అల్పాదాయ వర్గాలకు ఎవరైనా ఇస్తే ఇది జారిపోతే ఎంత నష్టమని, దీనికి చిల్లర ఎవరిస్తారని ఆ నోటు వద్దు అనుకొనే వారు.

అంటే ఇప్పుడు చలామణిలో వున్న రూ.3.62 లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు కేవలం భారీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, రాజకీయ నేతలు, అవినీతి ఉద్యోగులు లాంటి బాపతుల దగ్గరే చీకట్లో మూలుగుతూ వుండాలి. ఇందు మూలంగా ఈ నోటు ఉపసంహరణ వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా మే 23 నుండి సెప్టెంబర్ 30 దాకా తడవకు 10 నోట్లు చొప్పున బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చనే వెసలుబాటు ప్రభుత్వం ప్రకటించింది. ఒక నెల రోజుల్లో తక్కువ సంఖ్యలో ఆ నోట్లు వున్న ప్రజలు వాటిని బ్యాంకుల్లో అప్పగిస్తే వాటి లెక్క తేలితే మిగితా సొమ్ము ఎక్కడుందీ, ఏమైందీ అనే ప్రశ్నలు వస్తాయి. దాని కోసం ఏ మార్గాలు చేపట్టాలో ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు.

రూ. 2000 నోటు సెప్టెంబర్ 30 తర్వాత పనికే రాదు అన్నట్లుగా ప్రచారమవుతున్న వేళ గమనించవలసిన కీలక అంశం ఏమిటంటే రిజర్వు బ్యాంకు రెండు వేల నోటును ఉపసంహరించుకుంది తప్ప రద్దు చేయలేదు. అనగా సెప్టెంబర్ 30 తర్వాత ఈ నోటు దేశంలో చెల్లదని గాని, దానిని దగ్గర పెట్టుకున్న వాళ్ళు నేరస్థులని గాని ఆర్‌బిఐ ప్రకటించలేదు. కరెన్సీ క్లీన్ పాలసీ కింద వీటిని ఉపసంహరించుకుంటున్నామని మాత్రం ఆర్‌బిఐ ప్రకటనలోని సారాంశం. సాధారణంగా 56 ఏళ్ళ కాలం చలామణి అయిన నోటు వాడకం వల్ల కాగితం మెత్తబడి చినిగే అవకాశం వుంటుంది. అదే క్రమంలో రెండు వేల నోటును సైతం వెనక్కి తీసుకుంటున్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ప్రింటయిన మొత్తం 2 వేల నోట్లలో 86% రిజర్వు బ్యాంకు ఖాతాలో చెలామణిలో లేకుండా పోయాయి. మిగతా వాటిని కూడా సేకరిస్తే ఆ నోటు పై ఒక న్యాయ సమ్మత నిర్ణయం తీసుకోవచ్చు. నోట్ల రద్దు అని రిజర్వు బ్యాంకు ప్రకటించనందున సెప్టెంబర్ 30 తర్వాత ఫలితాలను పరిశీలించి మరో నిర్ణయం తీసుకొనే అవకాశం వుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

నవంబర్ 2016 లోనే రెండు వేల నోటుకు బదులు వేయి రూపాయల కొత్త నోటును విడుదల చేస్తే ఆ ఉపసంహరణ, ముద్రణ భారం తప్పేదని కొందరి వాదన. ఏది ఏమైనా రెండు వేల నోటుది అల్పాయిష్షు పుట్టుకే. దాని అవసరం కూడా దేశ సామాన్య ప్రజలకు లేదు. పైగా వాటి నకిలీ నోట్ల వార్తలు కూడా వస్తున్నాయి. 202122లో 13604 రెండు వేల నోట్ల నకిలీలు దొరికినట్లు పత్రికల్లో వచ్చింది. రెండు వేల నోట్లు వస్తే అవినీతి తగ్గుతుందని అప్పుడు, వాటిని తొలగిస్తేనే అవినీతి అరికట్టవచ్చని ఇప్పుడు అనడం ప్రధాని మోడీ నిరక్షరాస్యతకు చిహ్నమని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి రాజకీయ విమర్శ కోణం కూడా కొనసాగుతున్నా వాటికి అంత స్పందన రావడం లేదు.
వీటి ఉపసంహరణ నిర్ణయం ఎప్పుడో జరిగినా ముహూర్తం మాత్రం వాయిదా పడుతూ ఇప్పుడు బయటపడింది.రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల దృష్టితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ అమ్ములపొదలోని ఒక అస్త్రంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించిందనే వాదన కొంత వుంది.

దానిలో నిజం పాళ్లే ఎక్కువని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రంలో బిజెపి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విషయంలో వారికే అనుమానం కలిగేలా పరిస్థితులు వున్నాయి. కేంద్రంలో పాలన చాలా పేలవంగా వుంది. అన్ని ఆకర్షణ సద్దులు ప్రభను కోల్పోతున్నాయి. అయోధ్య మందిర నిర్మాణం, హిందు మతతత్వ ప్రచారం తదితర సంకుచిత అంశాలతో ఓట్లు పొందవచ్చనే నమ్మకం బిజెపి వర్గాల్లో సన్నగిల్లేలా కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు శాంతి భద్రతల దృష్టా రాష్ట్రంలో భజరంగ్ దళ్ కార్యకలాపాలను నిషేధిస్తామని ఎన్నికల హామీలో భాగంగా ప్రకటిస్తే దానిని వక్రీకరించిన ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రసంగాలలో కాంగ్రెస్ పార్టీ భజరంగీకి వ్యతిరేకమని, హనుమంతుడిని అవమానించేలా మాట్లాడుతున్నారని అన్నారు. జై భజరంగ్ భళీ అని ఓటేయాలని వేదికల మీది ఆయన ప్రకటించడం విస్మయం కలిగించే విషయం. అయితే కర్ణాటక ఫలితాలు ప్రధానికి తీవ్ర నిరాశ పరచాయి. మతతత్వ ప్రచారం ఎన్నికల్లో పని కొచ్చేలా లేదనే విషయం కర్ణాటకలో తేలిపోయింది.

దక్షిణ భారతంలో వున్న ఒక్క ఆసరా పోయింది. ఎన్నికల్లో ప్రచారానికి ధన ప్రవాహమే ఇంధనం. దానికి అడ్డుకట్ట వేస్తే ఇతర పార్టీల ఆర్థిక బలాన్ని దెబ్బ కొడితే ఎన్నికల్లో విజయానికి అవకాశాలు మెరుగవుతాయనే ఉద్దేశంతో ఈ కీలక సమయాన రెండు వేల నోటు ఉపసంహరిణ నిర్ణయం తీసుకొన్నారని అనుకోవచ్చు. నిజానికి ఈ నిర్ణయం ప్రధానంగా రాజకీయ వర్గాలకే పెద్ద దెబ్బ. ఎన్నికల ఖర్చు కోసం దాచిన పెద్ద నోట్లను సెప్టెంబర్ 30 లోగా మరో రూపంలోకి మార్చాలి. వీలైతే బంగారం, భూముల కొనుగోలు చేసి ఆ తర్వాత వాడుకోవాలి. ఈ నిర్ణయంతో బంగారం, భూముల విలువలను కూడా పెంచవచ్చు. కార్లు, టివిలు, ఖరీదైన మొబైల్ల అమ్మకాలు పెరగవచ్చు. ఉన్నత వర్గాలను కలవరచే ఈ నిర్ణయం సెప్టెంబర్ 30 తర్వాత వారికి అనుకూల మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News