Monday, April 29, 2024

గాంధీలో నాన్‌కోవిడ్ సేవలకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

Ready for Non-Covid services in Gandhi Hospital

హైదరాబాద్: నగరంలో పేద ప్రజలకు వైద్య సేవలందించే గాంధీలో నాన్ కోవిడ్ సేవలు ప్రారంబించేందుకు వైద్యశాఖ అధికారులు ఏర్పాట్లు వేగం చేశారు. గత ఆరునెలల నుంచి కోవిడ్ రోగులకు మాత్రమే చికిత్సలు చేస్తుండటంతో సాధారణ రోగులు ఇబ్బందులు పడుతూ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్దితి నెలకొంది. దీంతో ప్రభుత్వం నెలరోజుల కితం ఉస్మానియా, ఫీవర్, ఈఎన్‌టి వంటి ఆసుపత్రులో ఓపి సేవలు ప్రారంబించింది. తరువాత నగరంలో బారీ వర్షాలు కురువడంతో సీజనల్ వ్యాధులు విజృంభించి వేలాదిమంది వైద్యం కోసం ఉస్మానియా ,పీవర్ ఆసుపత్రులకు వెళ్లారు. గత 15 రోజుల నుంచి ఈప్రధాన ఆసుపత్రులు రోగులతో సందడిగా మారాయి.

ఆయా ఆసుపత్రులు అధికారులు వైద్యశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఆసుపత్రుల్లో సరిపడ సౌకర్యాలు,పరికరాలు లేవని రోగులకు చికిత్స అందించాలంటే కష్టంగా మారిందని, వెంటనే గాంధీలో సేవలు ప్రారంభిస్తే అందరికి సకాలంలో వైద్యం చేయవచ్చని సూచించడంతో వైద్యశాఖ అధికారులు గాంధీ ఆసుపత్రిలో సాధారణ రోగులకు సేవలందించేందుకు వార్డులను పరిశీలించి, తగిన పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. రెండు రోజుల కితం డిఎంఈ రమేష్‌రెడ్డి ఆసుపత్రి సందర్శించి, కోవిడ్ వార్డు, పోస్టు కోవిడ్ వార్డు, పిల్లలకు సంబంధించిన వార్డులు ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు. ఈనెల 21వ తేదీలోపు ఓపి రోగులకు చికిత్సలు ప్రారంబించాలని ఆదేశించారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది కావాల్సిన ఏర్పాటుల్లో తలమునకలైయ్యారు. అదే విధంగా మెడికల్ విద్యార్దులు కూడా క్లినిక్ శిక్షణలో వెనకబడుతామని, త్వరలో సేవలు ప్రారంభించి తనకు తర్పీదు ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు.

గాంధీ ఆసుపత్రి రోగులకు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నూతన పరికరాలు, పడకలు, స్టెచర్లు, వార్డుల్లో మరుగుదొడ్లు పూర్తిగా కొత్తవి ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వెళ్లితే చూస్తే పూర్తిగా రూపురేఖలు మారాయి. కోవిడ్ రోగులు సేవలందించడంతో ఆప్రభావం ఇతర రోగులకు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిబ్బందిని కూడా కోవిడ్‌వార్డు, పోస్టు కోవిడ్ వార్డులకు ప్రత్యేక నియమిస్తున్నట్లు, వారు ఇతర వార్డులోకి రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 350 పడకలు కోవిడ్ , 100 పడకలు పోస్ట్ కోవిడ్, 900 పడకలు సాధారణ రోగుల కోసం సిద్దం చేస్తున్నట్లు గాంధీ వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటు, కాంట్రాక్టు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని మూడురోజుల కితం ఆదేశించినట్లు తెలిసింది. గాంధీలో వైద్యసేవలు ప్రారంభిస్తే ఉస్మానియా,ఫీవర్ ఆసుపత్రులతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల, బస్తీదవాఖానలకు భారం తగ్గుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News