Monday, May 6, 2024

మొబైల్ పోతే కనిపెట్టొచ్చు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మొబైల్ పోయినా, దొంగిలించినా ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మే 17న ప్రపంచ టెలికాం దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మొబైల్ బ్లాకింగ్, ట్రాకింగ్ వ్యవస్థను ప్రారంభించనుంది. కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సంచార్ సాథి పోర్టల్ (సిఇఐఆర్)ని అధికారికంగా ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రజలు తమ మొబైల్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా వాటిని బ్లాక్ చేయవచ్చు, జాడ తెలుసుకోవచ్చు. సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సిడిఒటి) ప్రస్తుతం ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక,

ఈశాన్య ప్రాంతంలోని కొన్ని టెలికాం కార్యాలయాలలో ఈ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తోంది. ఇది ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా విస్తరించనున్నారు. సిడిఒటి చైర్మన్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ, మొబైల్ బ్లాకింగ్, ట్రాకింగ్ సిస్టమ్ దేశవ్యాప్తంగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మొబైల్స్ స్మగ్లింగ్‌ను కూడా తనిఖీ చేసే వ్యవస్థలో ఇన్‌బిల్ట్ మెకానిజం ఉందని ఆయన తెలిపారు. అయితే ఇది ఎప్పుడు మొదలవుతుందనే విషయం వెల్లడించలేదు.

ఐఎంఇఐ నంబర్ మార్చినా ట్రాకింగ్
నేరస్థులు మొబైల్‌ను దొంగిలించిన తర్వాత పరికరం ఐఎంఇఐ నంబర్‌ను మారుస్తారు. దీని కారణంగా మొబైల్‌ను ట్రాక్ చేయడం, బ్లాక్ చేయడం సాధ్యం కాదు. ఐఎంఇఐ నంబర్‌ని మార్చిన తర్వాత కూడా ఈ పోర్టల్ పరికరాన్ని ట్రాక్ చేయగలదని, బ్లాక్ చేయగలదని రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ వెల్లడించారు.
8000 ఫోన్‌లు రికవరీ
ఇప్పటి వరకు దాదాపు 4.70 లక్షల పోయిన లేదా దొంగిలించిన మొబైళ్లు ఈ పోర్టల్ ద్వారా బ్లాక్ చేశారు. దీంతో పాటు 2.40 లక్షలకు పైగా మొబైల్‌లను ట్రాక్ చేశారు. కాగా పోర్టల్ సహాయంతో 8000 ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు నివేదిక వెల్లడించింది. ఇటీవల కర్ణాటక పోలీసులు పోర్టల్ సహాయంతో 2500కు పైగా పోగొట్టుకున్న మొబైల్‌లను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News