Saturday, April 27, 2024

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Red sandal smugglers arrested in nellore

అమరావతి: నెల్లూరు అటవీ పరిధిలోని ఉదయగిరి మండలం కొత్తపల్లి సమీపంలో ఎనిమిది ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు ను రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎనిమిది ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఆదేశాలు మేరకు డిఎస్ పి మురళీధర్ సూచనలతో ఆర్ఐ ఆలీబాషా బుధవారం రాత్రి నుంచి ఉదయగిరి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కొత్తపల్లి బీట్ పరిధిలో ముగ్గురు అనుమానిత వ్యక్తులు కనిపించారు. వారిని విచారించగా చెన్నై కు రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని ఆనంతసాగరం మండలం లింగనగుంటకు చెందిన పోలూరు సరసింహులు (37), ఉదయగిరి మండలం బండగాని పల్లి కి చెందిన నల్లు నాగయ్య (37), దుత్తలూరు జోన్ చింతలగుంట కు చెందిన దుగ్గిబోయిన రవి (48) లు గా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. దీనిపై డిఎస్ పి మురళీధర్ మాట్లాడుతూ అరెస్ట్ చేసిన వారిని కోర్టు లో హాజరు పరుస్తామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు విలువ 20 లక్షల రూపాయలు వరకు ఉంటుందని తెలిపారు. ఈ కేసును సిఐ చంద్రశేఖర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News