Friday, April 26, 2024

హెటిరో, సిప్లాలకు రెమ్‌డెసివర్ కాంట్రాక్టు

- Advertisement -
- Advertisement -

Remdesivir contract for Hetero and Cipla

 

న్యూఢిల్లీ : యాంటివైరల్ డ్రగ్ రెమ్‌డెసివర్ ఉత్పత్తికి హెటిరో, సిప్లాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్ చికిత్సకు రెమ్‌డెసివర్ బాగా పనిచేస్తోందని నిర్థారణ అయింది. ఈ దశలో దీనిని విరివిగా మార్కెట్‌కు తీసుకురావడం అవసరం. ఈ కోణంలో దీని ఉత్పత్తి, మార్కెటింగ్‌లకు హెటిరో, సిప్లాలకు తగు అనుమతిని ఇచ్చారని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. హెటిరో కంపెనీ ఉత్పత్తి కేంద్రం హైదరాబాద్‌లో ఉంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డిసిజిఐ) ఒక్కరోజు క్రితమే స్వదేశీ ఔషధ ఉత్పత్తి సంస్థ గ్లెన్‌మార్క్ ఫెవిపిర్‌విర్ మందును ఉత్పత్తి చేసేందుకు అనుమతిని ఇచ్చింది. కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో భారీ స్థాయిలో నివారణ మందులు, వ్యాక్సిన్‌ల అవసరం ఏర్పడింది. అత్యయిక పరిస్థితి నేపథ్యంలో వైరస్ విరుగుడుకు మందుల అవసరం ఉందని సంస్థ గుర్తించిందిం.

రెమ్‌డెసివిర్‌ను పరిమిత, అత్యవసర పరిస్థితులలో వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. హెటిరో , సిప్లాలు కొత్త మందు తయారీ వాటి పంపిణీ బాధ్యత కూడా చేపట్టాల్సి ఉంటుంది. రోగుల నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తరువాతనే ఈ మందును వాడాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా పూర్తిస్థాయిలో కరోనా వైరస్ చికిత్సకు సమగ్ర ఔషధం రాకపోవడం, క్లినికల్ దశల్లోనే మందులు ఉండటంతో వీటిని రోగులకు పరిమితంగా వారి అనుమతితో, ప్రత్యేకించి వారి శారీరక పరిస్థితిని అంచనా వేసుకుని వాడాల్సి ఉంటుంది. ఇటీవలే రెమ్‌డెసివిర్‌ను దేశంలో పరిమిత స్థాయిలో వాడవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న వారికి దీనిని అందించాల్సి ఉంటుంది. ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కోవిడ్ 19 రోగులకు చికిత్స విషయంలో నియమావళిని వెలువరించింది. ఇప్పటికీ రెమ్‌డెసివిర్ పరిశోధనలలోనే ఉన్న ధెరపీగా ఉంది. అత్యవసర స్థితిలోనే దీనిని వాడుకోవల్సి ఉంటుంది. శ్వాసకోశ తీవ్రత ఉన్న వారికి దీనిని నిషేధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News