Saturday, May 4, 2024

ఉద్యమం ఆగదు : రైతులు

- Advertisement -
- Advertisement -

Repeal of Agricultural laws is main point :Farmers

 

న్యూఢిల్లీ : తమ ఉద్యమాన్ని, నిరసనలపై వెనుకడుగు లేదని, ఇవి కొనసాగుతాయని రైతు సంఘాలు బుధవారం రాత్రి స్పష్టం చేశాయి. ఆరో దఫా చర్చలలో కొంత మేర ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరిందని, 4న తిరిగి చర్చలు ఉంటాయని కేంద్రం తెలిపింది. దీని తరువాత రైతు సంఘాల నుంచి ప్రతిస్పందన వెలువడింది. వ్యవసాయ చట్టాల రద్దు తమ ప్రధాన అంశం అని, వీటిని ఆమోదించే విషయం పరిశీలించుకునేందుకు రైతులు కమిటీ వేసుకుంటే బాగుంటుందనే కేంద్రం వాదనను రైతు సంఘాలు తోసిపుచ్చాయి. ఆరో దఫా చర్చలతో పెద్దగా ప్రయోజనం ఏమీ లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం తమను నిరసనలు విరమించుకోవాలని కోరుతోందని, అయితే దీనికి తాము సమ్మతించేది లేదని , తమకు ప్రభుత్వం నుంచి నిర్టిష్ట ప్రతిపాదన రాలేదని, అప్పటివరకూ తాము ఉద్యమాన్ని విరమించుకునేదిలేదని ఆలిండియా కిసాన్ సభ పంజాబ్ శాఖ అధ్యక్షులు బాల్‌కరణ్ సింగ్ బ్రార్ ప్రభుత్వంతో చర్చల తరువాత తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News