Wednesday, May 8, 2024

తెలంగాణ, ఎపి మధ్య వాహన రాకపోకలపై ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Restrictions on vehicular traffic between Telangana and AP

 

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వాహన రాకపోకలపై ఎపి అధికారులు అధికారులు ఆంక్షలు విధించారు. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఎపి సర్కార్ అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేసింది. ఈక్రమంలో మధ్యాహ్నం 12 గంటల నుండి ఉదయం 6 వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులైన రామాపురం(కోదా), పొందుగు(వాడపల్లి), నాగార్జున సాగర్(మాచర్ల వైపు)మూడు చెక్ పోస్టులను మూసివేశారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్‌ల మూసివేతతో రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ నెల 18 వరకు ఎపిలో కర్ఫ్యూ కొనసాగనుంది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపిస్తే ఇరు రాష్ట్రాలలోకి అనుమతి ఇవ్వనున్నారు. కర్ఫ్యూ నుంచి పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు మినహాయింపు ఉంది.

అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. బోర్డర్ చెక్‌పోస్ట్‌ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద తెలంగాణ నుంచి వెళ్లే వాహనాలను అనుమతించడం లేదు. దీంతో కొందరు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏపీలోకి ప్రవేశిస్తున్నారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు వరకు పూర్తి స్థాయి కర్ఫ్యూ ఉన్నందువల్ల వాహనాలను నిలిపివేస్తున్నట్లు నందిగామ డీఎస్పీ నాగేశ్వరెడ్డి తెలిపారు.అత్యవసర వాహనాలను మాత్రమే ఏపీలోకి అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రయాణికులు తిరుగు ప్రయాణం అవుతున్నారు. కొందరు మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News