Saturday, April 27, 2024

గరీబ్ కల్యాణ్‌కు గండి!

- Advertisement -
- Advertisement -

Rice and wheat under Garib Kalyan package

 

దేశంలో దాదాపు 14 కోట్ల 45 లక్షల మందికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ క్రింద బియ్యం, గోధుమలు ఇవ్వవలసి ఉంది. ఈ ప్రజలంతా పేదవారు. ప్రభుత్వ సహాయంపై ఆధారపడినవారు. కాని చాలా మందికి మే నెలలో ఆహార ధాన్యాలు అందలేదు. నిజానికి ప్రభుత్వ గోదాముల్లో ఆహార ధాన్యాలు నిల్వపడిఉన్నాయి. జూన్ 3వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన డేటా ఈ వాస్తవాలు తెలియజేసింది. డేటాను పరిశీలిస్తే తెలిసే మరో విషయమేమిటంటే, 6 కోట్ల 44 లక్షల మంది రేషను కార్డులున్నవారికి ఏప్రిల్‌లో అందవలసిన రేషను కూడా అందలేదు. గత నెలలో వైర్ మీడియా సంస్థ రిపోర్టు ప్రకారం, జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ప్రయోజనాలు పొందవలసిన వారిలో 20 కోట్ల మందికి ప్రయోజనాలు లభించలేదు. వీళ్ళకు రేషను కార్డులు కూడా ఉన్నాయి. వీళ్ళకు 5 కిలోల ఆహార ధాన్యాలు అదనంగా ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో ఏప్రిల్ నెలలోనే ఇవ్వా లి. వీళ్ళకు అదనంగా ఇస్తామన్న ఆహార ధాన్యాలు ఇవ్వలేదు.

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ మార్చి 26వ తేదీన ప్రకటించారు. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద ప్రయోజనం పొందే వారి సంఖ్య 80 కోట్ల 3 లక్షల మంది వరకు ఉన్నారు. ఆర్ధిక మంత్రి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల ఆహార ధాన్యలు ఇస్తామన్నారు. నెలకు ఇచ్చే 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు ఇస్తామని వాగ్దానం చేశారు. పైగా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉచితంగా ఇస్తామన్నారు. అంతేకాదు, మూడు నెలల పాటు రేషను కార్డులున్న కుటుంబాలకు నెలకు కిలో పప్పు ధాన్యాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. ఇదంతా లాక్ డౌన్ తర్వాత ప్రకటించిన హామీలు.

ఏప్రిల్ నెలలో చూస్తే, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో ఇస్తామన్న 5 కిలోల అదనపు ఆహార ధాన్యాలు 736.8 మిలియన్ల మందికి అంటే 73 కోట్ల 68 లక్షల మందికి ఇచ్చారు. కాని, జూన్ 3 నాటికి మిగిలిన 6 కోట్ల 44 లక్షల మందికి ఈ సహాయం అందనే లేదని ప్రభుత్వ డేటాను చూస్తే అర్థమవుతుంది. జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద రేషను కార్డులున్న వారికి మామూలుగా అందుతున్న 5 కిలోల ఆహార ధాన్యాలు 95 శాతం పేదలకు అందాయి. మే నెలను పరిశీలిస్తే, అదనంగా ఇస్తామన్న 5 కిలోల ఆహార ధాన్యాలు 65 కోట్ల 85 లక్షల మందికి అందాయి. మిగిలిన 14 కోట్ల 45 లక్షల మందికి ఈ సహాయం అందలేదు. కాగా మామూలుగా నెలకు అందవలసిన రేషను కూడా 86 శాతం పేదలకే అందింది.

ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ క్రింద 803 మిలియన్ల మందికి, అంటే 80 కోట్ల 3 లక్షల మందికి ప్రయోజనాలు అంది ఉంటే, అంటే అదనంగా ఇస్తామన్న 5 కిలోల ఆహార ధాన్యాలు కూడా కలిపి ఇచ్చి ఉన్నట్లయితే, ఏప్రిల్, మే నెలల్లో 40 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యేవి. కాని అలా జరగలేదు. ఏప్రిల్ నెలలో 36 లక్షల 93 వేల మెట్రిక్ టన్నలు ఆహార ధాన్యాలు మాత్రమే పంపిణీ అయ్యాయి. ఇందులో కూడా ఒక తిరకాసు ఉంది. ఏప్రిల్ నెలలో ఇవ్వవలసిన ఆహార ధాన్యాల పంపిణీ ఆ నెలలో 30 లక్షల 16 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ మాత్రమే జరిగింది.

ఏప్రిల్ నెలకు సంబంధించి చూపిస్తున్న డేటాలో మిగిలింది ఏప్రిల్ గడిచిపోయిన తర్వాత, మే నెలలో ఇచ్చారు. ఇక మే నెలను పరిశీలిస్తే, 32 లక్షల 92 వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ అయ్యాయి. నిజానికి పంపిణీ చేయవలసింది 40 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు. గత నెలలో కేంద్ర మంత్రి, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖకు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ సమాచారాన్ని ట్విట్టరులో పెట్టారు. ప్రజా పంపిణీలో వెనుకబడి రాష్ట్రాల పేర్లు కూడా ఆయన చెప్పారు. ఆ రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు. ఈ నెలలో రాష్ట్రాల జాబితా ఏదీ ఇవ్వలేదు.

కేంద్రం విడుదల చేసిన సమాచారం ప్రకారం 101 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యలు రాష్ట్రాలు తీసుకున్నాయి. కాని ఈ ఆహార ధాన్యాల్లో కేవలం 70 శాతం మాత్రమే పంపిణీ చేశాయని తెలుస్తోంది. జూన్ 3వ తేదీన ప్రభుత్వం జారీ చేసిన సమాచారం ప్రకారం తెలుస్తున్న మరో విషయమేమిటంటే, ఏప్రిల్, మే నెలల్లో పేదలకు అందవలసిన పప్పు ధాన్యాల్లో కేవలం 40 శాతం మాత్రమే నిజానికి పంపిణీ అయ్యాయి. నిర్మలా సీతారామన్ ఇచ్చిన హామీ ప్రకారం అయితే 2 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు ప్రతి నెల పంపిణీ చేయాలి. అంటే మే నెలాఖరు నాటికి 4 లక్షల 72 వేల మెట్రిక్ టన్నలు ఆహార ధాన్యాలు పంపిణీ అయి ఉండాలి. కాని పంపిణీ జరిగింది కేవలం 1 లక్షా 91 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే.

జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (నాఫెడ్) దేశంలో పప్పు ధాన్యాల నిల్వలను సేకరిస్తుంది. ఈ సమాఖ్య ఏప్రిల్ నెలలో ఒక ప్రకటన చేసింది. మూడు నెలల పప్పుధాన్యాల పంపిణీ మే నెల మూడవ వారంలో పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పింది. కానీ అలా జరగలేదు. జూన్ 3వ తేదీ నాటికి రేషను కార్డులున్న వారికి 26 శాతం పప్పుధాన్యాల పంపిణీ మాత్రమే జరిగింది.

మే 14వ తేదీన నిర్మాలా సీతారామన్ మాట్లాడుతూ ప్రజాపంపినీ వ్యవస్థ పరిధిని కూడా విస్తరిస్తున్నట్లు చెప్పారు. రేషను కార్డులు లేని 8 కోట్ల మంది వలస కూలీలను కూడా ఇందులో చేరుస్తున్నామని అన్నారు. వలస కూలీల సంఖ్య ఎలా లెక్కించారన్న వివరాలు ఆమె చెప్పలేదు. ఈ వలస కూలీలకు కూడా ప్రతి వ్యక్తికి 5 కిలోల ఆహారధాన్యాలు, ప్రతి కుటుంబానికి 1 కిలో శనగలు రెండు నెలల పాటు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన పత్రికా ప్రకటనలో ఈ హామీ గురించి ప్రస్తావన కూడా లేదు. అయితే ఈ హామీ అమలు చేయడానికి అవసరమైన ఆహార ధాన్యాల్లో 25.75 శాతం మాత్రమే తరలించారు. ఈ ఆహార ధాన్యాలను తీసుకున్నది ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తీసుకున్నాయి. అయితే సెనగల పంపిణీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు.

ఇక్కడ గమనించవలసిన మరో విషయమేమంటే, జాతీయ ఆహార భద్రత చట్టం క్రింద రేషను కార్డులున్న వారి సంఖ్య ఆధారంగా మాత్రమే ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో సహాయం పొందే అర్హత ఉండి కూడా సహాయం లభించని వారిని లెక్కకట్టడం జరిగింది. కాని ప్రభుత్వ సహాయం అవసరమైన వారి సంఖ్య ప్రస్తుతం రేషను కార్డులున్న 80 కోట్ల 30 లక్షల కన్నా ఎక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. మేఘనా ముంగీకర్; జాన్ డ్రెజ్, రీతికా ఖేరా వంటి నిపుణుల ప్రకారం ఆహార భద్రత చట్టం పరిధిలో ప్రయోజనం పొందేవారి సంఖ్య మరో 10 కోట్ల 80 లక్షల మంది వరకు ఎక్కువ ఉండవచ్చు. భారత జనాభా లెక్కలు 2011 ప్రకారం ప్రస్తుతం లెక్కలున్నాయి. అప్పటి నుంచి ఇప్పటికి భారత జనాభా మరో 15 కోట్లు పెరిగి ఉంటుందని అంచనా. పైగా, కరోనా, లాక్ డౌన్ల కారణంగా భారీ సంఖ్యలో ప్రజలు ఉపాధి కోల్పోయారు. నిరుపేదలుగా మారారు. ఆహార భద్రత అవసరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పటికే దాదాపు 132 ఆకలి చావులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News