Monday, April 29, 2024

అగ్రశ్రేణి కంపెనీల్లో రిలయన్స్, టిసిఎస్…

- Advertisement -
- Advertisement -

 

Reliance and TCS

ముంబై: మార్కెట్ వాల్యూయేషన్ దృష్ట్యా అగ్రశ్రేణిలో ఉన్న 10 కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ,  టిసిఎస్ టాప్ లో ఉన్నాయి. లీడ్ గెయినర్లుగా ఎదుగుతున్న ఈక్విటీలలో బుల్లిష్ ట్రెండ్ మధ్య 10 అత్యంత విలువైన సంస్థల్లో తొమ్మిది గత వారం తమ మార్కెట్ వాల్యుయేషన్‌కు రూ.2.98 లక్షల కోట్లు జోడించాయి. గత వారం, 30 షేర్ల బిఎస్ఈ బెంచ్‌మార్క్ 2,311.45 పాయింట్లు లేదా 4.29 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి) మినహా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్‌లతో సహా టాప్ 10 కంపెనీలు తమ మార్కెట్ విలువకు మొత్తం రూ.2,98,523.01 కోట్లు జోడించాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎంక్యాప్) శుక్రవారం ముగింపు సమయానికి రూ.68,564.65 కోట్లు పెరిగి రూ.16,93,245.73 కోట్లకు చేరుకుంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వాల్యుయేషన్ రూ.64,929.87 కోట్లు పెరిగి రూ.11,60,285.19 కోట్లకు చేరుకుంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.34,028.7 కోట్లను జోడించి రూ.5,56,526.81 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ ఎంక్యాప్ రూ.31,893.77 కోట్లు పెరిగి రూ.6,33,793.91 కోట్లకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.30,968.4 కోట్లు పెరిగి రూ.4,58,457.30 కోట్లకు చేరుకుంది. బజాజ్ ఫైనాన్స్ విలువ రూ.20,636.69 కోట్లు పెరిగి రూ.3,78,774.69 కోట్లకు, హిందుస్థాన్ యూనిలీవర్ విలువ రూ.16,811.32 కోట్లు పెరిగి రూ.6,20,362.58 కోట్లకు చేరింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వాల్యుయేషన్ రూ.16,110.37 కోట్లు పెరిగి రూ.7,73,770.09 కోట్లకు చేరగా, హెచ్‌డిఎఫ్‌సి విలువ రూ.14,579.24 కోట్లు పెరిగి రూ.4,16,701.23 కోట్లకు చేరుకుంది.

మార్కెట్ క్యాపిటలైజేషన్లో  వెనుకబడిన వాటిలో  ఎల్‌ఐసీ విలువ రూ.12,396.99 కోట్లు తగ్గి రూ.4,35,760.72 కోట్లకు చేరింది. టాప్ ర్యాంకింగ్‌ 10 సంస్థలలో  రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యంత విలువైన కంపెనీగా ఉద్భవించింది. టిసిఎస్ , హెచ్ డిఎఫ్ సి  బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందుస్తాన్ యూనిలీవర్, ఐసి ఐసిఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,ఎల్ఐసి, హెచ్ డిఎఫ్ సి  మరియు బజాజ్ ఫైనాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News